శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (12:33 IST)

కోడిగుడ్డులోని పచ్చసొనతో ఇంగువను కలిపి తింటే..?

asafoetida
ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇంగువను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అది నరాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే ఆహారం రుచిని మెరుగుపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. వంటలో సువాసనగా ఉపయోగించే ఈ మూలికలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
జీర్ణక్రియను ఇంగువ మెరుగుపరుస్తుంది. అల్లం, తేనెతో కలిపి ఇంగువను తీసుకోవచ్చు. ఇది ప్రేగులలోని సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అపానవాయువు, కడుపునొప్పి,  మలబద్ధకాన్ని నయం చేస్తుంది. 
 
అలాగే కోడిగుడ్డులోని పచ్చసొనతో ఇంగువను కలిపి తింటే పొడి దగ్గు దూరమవుతుంది. ఇంగువన శరీరంలోని వాత కఫాలను సమతుల్యం చేస్తుంది. ఇంగువను కాల్చడం.. దాని పొగను పీల్చడం వల్ల ఆస్తమా, శ్వాస ఆడకపోవడం వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. ఇందులోని రసాయనిక అణువులు ఛాతీలోని శ్లేష్మాన్ని బయటకు పంపేందుకు సహకరిస్తాయి. 
 
రోజూ ఉదయాన్నే అర టీస్పూన్ ఇంగువ పొడిని వేడి నీటిలో కలిపి తాగితే శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోతుంది. ఇందులో ఉండే ప్రొటీన్‌ వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగి అధిక రక్తపోటు తగ్గుతుంది. శరీర జీవక్రియను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 
బహిష్టు సమయంలో స్త్రీలలో వచ్చే పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పిని తగ్గిస్తుంది. అయితే రోజూ 5 నుంచి 30 మి.గ్రాముల ఇంగువను మాత్రమే తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే శరీరంలో పిత్తం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.