శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (18:09 IST)

అశ్వ‌గంధ చూర్ణంతో 'పవర్'

చాలామంది పురుషులు పడక గదిలో తమ భాగస్వామి లేదా ప్రియురాళ్లను సంతృప్తిపరచలేక తుస్ మంటుంటారు. దీనికి కారణం ప‌ని ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, హార్మోన్ వంటి అనేక సమస్యలు ఉ

చాలామంది పురుషులు పడక గదిలో తమ భాగస్వామి లేదా ప్రియురాళ్లను సంతృప్తిపరచలేక తుస్ మంటుంటారు. దీనికి కారణం ప‌ని ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, హార్మోన్ వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఎంతో ఉత్సాహంగా పడక గదిలోకి వెళ్లే పురుషులు.. పడకగదిలో తన పవర్ చూపించలేక మానసికంగా కుంగిపోతుంటారు. అలాగే, భాగస్వామి కూడా తీవ్రనిరుత్సాహానికి లోనవుతుంది. దీంతో తమ లైంగికశక్తిని పెంచుకునేందుకు వివిధరకాల మార్గాను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా ఇంగ్లీషు వైద్యంతో పాటు తమకు తెలిసిన చిట్కాలను పాటిస్తుంటారు. 
 
ఇలా శృంగార సామ‌ర్థ్య లేమి సమస్యతో బాధపడేవారు అశ్వ‌గంధ చూర్ణంతో ఆ శక్తిని పెంచుకోవచ్చు. దీంతో త‌యారు చేసే ప‌లు మిశ్ర‌మాల‌ను రోజూ వాడితే లైంగిక ప‌టుత్వం పెర‌గ‌డ‌మే కాదు, సంతానం క‌లిగేందుకు ఎక్కువగా అవ‌కాశం ఉంటుంది. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య పోతుంది.
 
అశ్వ‌గంధ చూర్ణాన్ని 3 లేదా 4 గ్రాముల మోతాదులో తీసుకుని, అదే ప‌రిమాణంలో చ‌క్కెర‌ను దానికి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి తీసుకోవాలి. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.
 
అలాగే, అశ్వ‌గంధ పొడిని, నెయ్యిని తగిన మోతాదులో కలుపి, ఆ మిశ్ర‌మానికి గాలి త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌గా ఉంచాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి పాలు లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. దీంతో లైంగికప‌టుత్వం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతుంది. స్త్రీల‌కైతే రుతుక్ర‌మం స‌రిగ్గా అవుతుంది.