శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (16:12 IST)

చలికాలంలో ఎక్కువ.. వేసవిలో తక్కువగా తులసిని తీసుకుంటే..?

Tulasi
చలికాలంలో ఎక్కువ.. వేసవిలో తక్కువగా తులసిని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసిని పరగడుపున తీసుకోవడం ఉత్తమం. పిల్లలు ఐదు, పెద్దలు ఏడు ఆకులను తీసుకోవడం మంచిది. తులసి అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. తులసిని మూడు, నాలుగుసార్లు మించి తీసుకోకూడదు. ఉదయాన్నే తులసి రసమును మంచి నీటితో తీసుకున్నట్లైతే జ్ఞాపకశక్తి, బలము, ఆకలి పెరుగుతుంది. 
 
నిమ్మపండు, ఉల్లి, వెల్లుల్లి, మజ్జిగ తులసిని కలిపి తీసుకుంటే.. కలరా వ్యాధి దరిచేరదు. తులసి రసముతో నోటిని పుక్కిలించినట్లైతే.. నోట్లోని పుండ్లు మానిపోతాయి. వేప రసాన్ని, తులసీ రసాన్ని కలిపి తీసుకున్నట్లైతే అంటువ్యాధులు అంటవు. గుండెజబ్బులకు తులసిరసము, అర్జున వృక్షము బెరడు కలిపి తీసుకున్నట్లైతే విశేష ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.