మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (17:01 IST)

మీరు ఏ రంగు వంకాయలను తింటున్నారు..?

వంకాయను కూరగాయలకు రాజు అని అందరూ పిలుస్తారు. ఎగిరే పావురమా చిత్రంలో ఆహా ఏమి రుచి, అనరా మైమరచి అనే పాట అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ పాటలో వంకాయను గురించి గేయ రచయిత భలేగా వర్ణించాడు. కూరగాయల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ వంకాయకు ఏదీ సాటి రాదు.


భోజన ప్రియులు ఎవరైనా సరే వంకాయ రుచికి ఫిదా అవ్వాల్సిందే. అందులోనూ మార్కెట్‌లో లభించే వంకాయలు భిన్నమైన ఆకృతుల్లో ఉంటాయి, కానీ రెండు రంగుల్లో మాత్రమే లభిస్తాయి. ఒకటి గ్రీన్, మరొకటి వయొలెట్.
 
ఈ రెండు రంగుల్లో ఏ రంగు వంకాయలను తినడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయల్లో పచ్చరంగులో ఉన్న వాటికంటే వయొలెట్ రంగులో ఉన్న వాటిని తినడం మంచిది. అందుకు ఒక కారణం లేకపోలేదు. అదే ఈ రంగులోని వంకాయలు సూర్యరశ్మిని బాగా గ్రహించి పెరుగుతాయి. కాబట్టే అవి ఈ రంగులో ఉంటాయి. కనుక వయొలెట్ రంగులో ఉండే వంకాయలను తినడం మంచిది. 
 
సూర్యరశ్మి గ్రహించబడిన వంకాయల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వయొలెట్ రంగులో ఉన్న వంకాయలను తినాలి. వంకాయలను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వంకాయల ద్వారా మన శరీరానికి అవసరమైన పలు ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.