మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (13:42 IST)

ఆ రకం పిజ్జాలు ఆరగించే స్త్రీలు.. భాగస్వామితో ఎంజాయ్ చేయాలని భావిస్తారట...

దంపతుల వైవాహిక జీవితంలో శృంగారం అత్యంత ముఖ్యమైనది. శృంగారం ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెంచడమే కాకుండా బలమైన బంధానికి పునాదిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పడక గది కెమిస్ట్రీ బాగుంటేనే... వారి జీవితం కూడా హాయిగా సాగిపోతుందని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే కొన్ని కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం, మరికొన్నింటిని దూరం చేసుకోవడం ద్వారా మరింత ఆనందమయమైన జీవితాన్ని పొందవచ్చట. ముఖ్యంగా, మనం తినే ఆహారం అనేది శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుందట. అయితే కొంతమంది కొన్నిరకాల ఫ్లేవర్స్‌తో కూడిన ఆహారపదార్థాలను ఇష్టపడతారు. ఆ ఇష్టపడే ఆహారాన్ని బట్టి ఆ వ్యక్తులు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటారో చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు.
 
సాధారణంగా ఇపుడు పిజ్జాలు తినడం సర్వసాధారణమై పోయింది. లవర్స్‌ అయినా భార్యాభర్తలైనా వీకెండ్‌ వస్తే చాలు కాలక్షేపం కోసం కబుర్లాడు కోవడానికి పిజ్జాహాట్స్‌లోకి దూరిపోతారు. అయితే పిజ్జాలో ఎన్నో రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకం వెరైటీని ఇష్టపడతారు. అయితే ఇష్టపడే పిజ్జాని బట్టి ఎలాంటి శృంగారాన్ని ఇష్టపడతారో, భాగస్వామితో ఎలా ఉండాలని అనుకుంటారో ఇట్టే చెప్పేయవచ్చట. మరి పిజ్జాకు శృంగార కోర్కెలకు ఉన్న లింకేంటో ఓ సారి పరిశీలిద్దాం. 
 
మార్గరెటా: ఇక పిజ్జాలో ఇదో రకం. మార్గరెటాని ఇష్టపడే వారు ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకుంటారు. కొత్తగా ప్రేమను వ్యక్తీకరించడం వీరికి అసలు రాదు. 
 
పెప్పరోని: ఈ రకం పిజ్జాని ఇష్టపడే వారు లేజీ లవర్స్‌గా ఉంటారు. ఏపనైనా సరే ఆలస్యంగా చేస్తుంటారు. అలాగే ఏపనైనా సరే ముందు భాగస్వామే ప్రారంభించాలని కోరుకుంటారు. తాము ముందుగా కమిట్‌ అవ్వరు. భాగస్వామికి సరెండర్‌ అవడం అంటే వీరికి ఇష్టం.
 
మీట్‌ ఫీస్ట్‌: ఈ పిజ్జా ఇష్టపడేవారు మార్గరెటా తినేవారికి భిన్నంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ కొత్తదనం కావాలి. అలాగే సమయం దొరికితే చాలు భాగస్వామితో కలిసి ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, హాలీడేస్‌ను భాగస్వామితో ఎంజాయ్‌ చేయడమంటే వీరికి మహాయిష్టం. 
 
వెజ్జీ: ఈ రకాన్ని ఇష్టపడేవారు సున్నితమనస్కులై ఉంటారు. వీరు పడక గదిలో తన భాగస్వామిని ఏమాత్రం కష్టపెట్టకుండా ఉండాలని కోరుకుంటారు. విషయం ఎలాంటిదైనా సరే స్మూత్‌గా డీల్‌ చేయాలని భావిస్తారు.