శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (22:16 IST)

చైనా యాప్‌ల నిషేధం: టిక్‌టాక్, హలో, షేరిట్, వియ్ చాట్, కామ్ స్కానర్ సహా 59 యాప్‌లపై భారత్ నిషేధం

భారత సార్వభౌమాధికారం, సమగ్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిసిందంటూ.. టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ కింద అధికారాలను ఉపయోగించుకుని ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది.

 
భారత సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, దేశ భద్రత, శాంతిభద్రతలకు ఈ యాప్‌లు విఘాతకరంగా వ్యవహరిస్తున్నాయని అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోందని వివరించింది. ల‌ద్దాఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ తాజా నిర్ణయాన్ని భార‌త్ తీసుకుంది.

 
చైనా యాప్‌లే అధికం...
భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి.

 
‘‘విదేశాల్లోని సర్వర్లకు డేటా తరలిస్తున్నారు...’’
"గ‌త‌ కొన్నేళ్లుగా ఆవిష్క‌ర‌ణ‌ల్లో భార‌త్ దూసుకెళ్తోంది. కొత్త‌ సాంకేతిక ప‌రిజ్ఞానాలు ఇక్క‌డ అవ‌త‌రిస్తున్నాయి. దేశం ప్ర‌ధాన డిజిట‌ల్ మార్కెట్‌గానూ మారింది. అదే స‌మ‌యంలో డేటా భ‌ద్ర‌త‌తోపాటు 130 కోట్ల మంది భార‌తీయుల గోప్య‌త‌‌పై ఆందోళ‌న‌లూ వ్య‌క్తం అవుతున్నాయి" అని ప్ర‌క‌ట‌న‌లో భార‌త్ పేర్కొంది.

 
"ఇలాంటి ముప్పుల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వం, భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగే అవ‌కాశ‌ముంది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ‌కు చాలా ఫిర్యాదులూ అందాయి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ప్లాట్‌ఫాంల‌లో కొన్ని యాప్‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. డేటా చౌర్యంతోపాటు విదేశాల్లోని స‌ర్వ‌ర్ల‌కు అన‌ధికారికంగా డేటాను త‌ర‌లిస్తున్నారని స‌మాచారం అందింది" అని వివరించింది.

 
"ఈ డేటాను దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేవారు డేటామైనింగ్‌, ప్రొఫైలింగ్ లాంటి సాంకేతిక‌త‌లతో శోధిస్తే.. భార‌త్‌ సార్వ‌భౌమ‌త్వం, దేశ స‌మ‌గ్ర‌త‌ల‌కు ముప్పు క‌లిగే అవ‌కాశ‌ముంది. ఇది చాలా ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం. దీనిపై స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

 
వీటిలో కొన్ని యాప్‌ల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాన్ చేయాలని ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కో-ఆర్డినేష‌న్ సెంట‌ర్‌, కేంద్ర హోం శాఖ కూడా సూచించాయని ప్రభుత్వం తెలిపింది. కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ (సెర్ట్‌-ఇన్‌)కు కూడా ఈ యాప్‌ల‌పై చాలా ఫిర్యాదులు అందాయని చెప్పింది.

 
ఈ యాప్‌ల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగే ముప్పుంద‌ని త‌గిన స‌మాచారం అందిన త‌ర్వాతే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది. వీటిని మొబైల్‌తోపాటు ఏ ఇంట‌ర్నెట్ ఆధారిత డివైజ్‌లోనూ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

 
నిషేధించిన యాప్‌ల జాబితా...
1.టిక్‌టాక్‌
 
2.షేర్ ఇట్‌
 
3.క్వాయ్‌
 
4.యూసీ బ్రౌజ‌ర్‌
 
5.బైదూ మ్యాప్‌
 
6.షెయిన్‌
 
7.క్లాష్ ఆఫ్ కింగ్స్‌
 
8.డీయూ బ్యాట‌రీ సేవ‌ర్‌
 
9.హెలో
 
10.లైకీ
 
11.యూక్యామ్ మేక‌ప్‌
 
12.ఎంఐ క‌మ్యూనిటీ
 
13.సీఎం బ్రౌజ‌ర్స్‌
 
14.వైర‌స్ క్లీన‌ర్‌
 
15.ఏపీయూఎస్ బ్రౌజ‌ర్‌
 
16.రామ్‌వీ
 
17.క్ల‌బ్‌ఫ్యాక్ట‌రీ
 
18.న్యూస్‌డాగ్‌
 
19.బ్యూటీప్ల‌స్‌
 
20.వీచాట్‌
 
21.యూసీ న్యూస్‌
 
22.క్యూక్యూ మెయిల్‌
 
23.వీబో
 
24.క్జెండ‌ర్‌
 
25.క్యూక్యూ మ్యూజిక్‌
 
26.క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌
 
27.బీగో లైవ్‌
 
28.సెల్పీ సిటీ
 
29.మెయిల్ మాస్ట‌ర్‌
 
30.ప్యార్ల‌ల్ స్పేస్‌
 
31.ఎంఐ వీడియోకాల్‌
 
32.వీ సింక్‌
 
33.ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్‌
 
34.వీవా వీడియో
 
35.మేయి టూ
 
36.వీగో వీడియో
 
37.న్యూ వీడియో స్టేట‌స్‌
 
38.డీయూ రికార్డ‌ర్‌
 
39.వాల్ట్ హైడ్‌
 
40.క్యాషే క్లీన‌ర్‌
 
41.డీయూ క్లీన‌ర్‌
 
42.డీయూ బ్రౌజ‌ర్‌
 
43.హ్యాగో ప్లే
 
44.క్యామ్ స్కాన‌ర్‌
 
45.క్లీన్ మ్యాస్ట‌ర్‌
 
46.వండ‌ర్ క్యామెరా
 
47.ఫోటో వండ‌ర్‌
 
48.క్యూక్యూ ప్లేయ‌ర్‌
 
49.వీ మీట్‌
 
50.స్వీట్ సెల్ఫీ
 
51.బైడూ ట్రాన్స్‌లేట్‌
 
52.వీ మేట్‌
 
53.క్యూక్యూ ఇంర్నేష‌న‌ల్‌
 
54.క్యూక్యూ సెక్యూరిటీ సెంట‌ర్‌
 
55.క్యూక్యూ లాంచ‌ర్‌
 
56.యూ వీడియో
 
57.వీ ఫ్లై స్టేట‌స్ వీడియో
 
58.మొబైల్ లెజెండ్స్‌
 
59.డీయూ ప్రైవ‌సీ