బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (12:58 IST)

‘హైదరాబాద్‌లో కరోనా టీకా వేయించుకునేవారికి టైమ్ స్లాట్ల కేటాయింపు’ - ప్రెస్ రివ్యూ

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే వినియోగదారులకు టైమింగ్‌ స్లాట్‌ కేటాయించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ తెలిపింది. టీకా వేయించుకునేవారికి వారి నివాస స్థలానికి దగ్గరలో ఉన్న కరోనా టీకా కేంద్రంలోనే వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తారు.

 
ముందుగా నమోదు చేసుకున్నవారికి నివాస స్థలానికి సంబంధించిన పిన్‌కోడ్‌, టీకా కేంద్రం కోడ్‌, చిరునామాతో పాటు టీకా వేసే తేదీ, సమయంతో కూడిన స్లాట్‌ వివరాలను మెసేజ్‌ రూపంలో పంపిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

 
మెసేజ్‌ వచ్చిన వారే నిర్ణీత తేదీలో స్లాట్‌ సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.