పేదల ఊటీ "ఏర్కాడు"లో హ్యాపీ సమ్మర్ ట్రిప్..!!

Deers
FILE
ఏర్కాసు సరస్సుకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే "లేడీస్ సీట్" చూడదగ్గ ప్రదేశం. లేడీస్ సీట్ వెళ్లేందుకు సేలం నుంచి ఏర్కాడుకు వెళ్లే రహదారిలో మెలికలు తిరిగే రోడ్లలో ప్రయాణం ఉల్లాసభరితంగా సాగుతుంది. ఆ తరువాత పగోడా పాయింట్, సెర్వరాయణ్ టెంపుల్, నార్టన్ బంగళా, బియర్స్ కేవ్ (ఎలుగుబంట్ల గుహ), 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా కీలకపాత్ర పోషించిన "ది గ్రేంజ్" కోట, 1917లో స్థాపించిన మౌంట్‌ఫర్డ్ ఉన్నత పాఠశాల చూడదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు.

ఏర్కాడులో ప్రతి సంవత్సరం సమ్మర్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇది మే రెండో వారంలో ప్రారంభమవుతుంది. ఏర్కాడులో భూముల సేద్యం ఉండదు. ఇక్కడంతా ఎక్కువగా కాఫీ తోటలనే సాగు చేస్తుంటారు. అదే విధంగా పసనపండ్లు, బెర్రీలు, కమలాపండ్లు, జామపండ్లను విరివిగా పండిస్తారు.

ఏర్కాడు చేరుకోవటం ఎలాగంటే.. విమాన ప్రయాణంలో తిరుచ్చిరాపల్లి వరకు ప్రయాణించి, ఆపై కోయంబత్తూర్ నుంచి బస్సు మార్గంలో ఏర్కాడు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో అయితే చెన్నై-కోయంబత్తూర్ రైలు మార్గంలో చెన్నై నుంచి 335 కిలోమీటర్ల దూరంలోని సేలం జంక్షన్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడినుంచి 35 కిలోమీటర్ల దూరంలోగల ఏర్కాడుకు బస్సు మార్గంలో వెళ్లవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి సేలం వరకు కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Ganesh|
ఇక వసతి విషయానికి వస్తే.. ఏర్కాడులో అనేక స్టార్ హోటళ్లతోపాటు చిన్నా, పెద్దా హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లకు కూడా కొదువేలేదు. వీటితోపాటు తమిళనాడు రాష్ట్ర పర్యాటక సాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తమిళనాడు, యూత్ హాస్టల్‌లు అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి.దీనిపై మరింత చదవండి :