బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 3 మే 2021 (23:04 IST)

మెంతి ఆకులకు తులసి ఆకులు కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే?

శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం ముడతలు పడుతుంది. నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయానే పరగడుపున ఆ నీటిని తాగితే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. 
 
నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. మెంతి ఆకులకు కొన్ని తులసి ఆకులను కలిపి మెత్తగా పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీద మచ్చలు, మెుటిమలు తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
రోజు రాత్రిపూట 3 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.