శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (18:33 IST)

అందానికి బియ్యం పిండి చాలు.. తెలుసా?

Rice Powder
అందానికి బియ్యం పిండి చాలునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్, టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కుకంటే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. 
 
చల్లటి పాలతో కొంత బియ్యం పొడి కలిపి పేస్టులా చేసి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారైనా ఇలా చేస్తే.. ఒకటి లేదా రెండు నెలల తర్వాత చర్మం కాంతివంతం కావడాన్ని గమనించవచ్చు. ఇలాచేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
అలాగే ముప్పావు కప్పు గులాబీ నీటిలో పావు కప్పు గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్, తేనె కలిపి సీసాలో భద్రపరచండి. దీన్ని సన్ స్ర్కీన్ లోషన్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. టేబుల్ స్పూన్ పాల పొడిలో, కొద్దిగా కీరదోస రసం, చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.