శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (12:18 IST)

ఆకర్షణీయమైన కనుల కోసం.. మేకప్ ఇలా వేసుకోవాలి...

వాలు కనులు ఆకర్షణీయంగా వుంటాయి. కానీ చిన్ని కనులుండే మహిళలు లేత రంగుల్లో మెరుస్తుండే ఐషాడోని ఎంపిక చేసుకోవాలి. లైట్ కలర్ షాడో వేసుకోవడం వల్ల కళ్లు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఐలాషెన్ ని షేప్ చేసుకొని

వాలు కనులు ఆకర్షణీయంగా వుంటాయి. కానీ చిన్ని కనులుండే మహిళలు లేత రంగుల్లో మెరుస్తుండే ఐషాడోని ఎంపిక చేసుకోవాలి. లైట్ కలర్ షాడో వేసుకోవడం వల్ల కళ్లు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఐలాషెన్ ని షేప్ చేసుకొని వంపు తిరిగేట్లుగా చేస్తే మీ కళ్లు అందంగా పెద్దగా కనిపిస్తాయి. ప్రధానంగా పై కనురెప్ప లాషెస్‌ని అలా చేస్తే కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
 
ఐలైనర్ వేసుకొనేటప్పుడు పైరెప్పకి లేదా ఏవిధంగా వేసుకుంటే బాగుంటుందో చూసుకోవాలి. అవసరమైతే కొంచెం డార్క్‌గా వేసుకోవచ్చు. బయటివైపు చివర ఐలైనర్‌ని ఎంత అందంగా వేసుకుంటే మీ కళ్లు అంత అందంగా కనిపిస్తాయి. మీ ముఖానికి తగిన ఆకారంలో ఐబ్రోస్‌ని షేప్ చేసుకొని బ్లాక్ లేదా లైటే కలర్ ఐమేకప్ వేసుకుంటే కళ్లు ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. 
 
అలాగే మేకప్ అనేది కళ్లను చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. మేకప్ వేసుకునే ముందుగా తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా మంచిది. ఇలా చేసినట్లైతే ముఖం మృదువుగా తయారవుతుంది. దాంతో సులభంగా అందంగా మేకప్ వేసుకోవచ్చు. ఫౌండేషన్‌కి బదులు నాన్ ఆయిలీ క్రీమ్ వాడండి. ఒకవేళ ఇది రాసుకున్న తరువాత కూడా ముఖంపై ఎక్కడైనా జిడ్డుగా అనిపిస్తే పౌడర్ రాసుకోవాలి. 
 
ఈ సమస్య జిడ్డు చర్మానికి తగిన రంగును ఎంపిక చేసుకొని నుదురు, చెంపలు, గడ్డం, ముక్కుపై బ్లష్ చేసుకోండి. తరువాత మీ కళ్లకి బ్రౌన్, బ్లూ కలర్ లైనర్, షాడోలు అందంగా ఉంటాయి. లైట్ మేకప్‌తో అందంగా కనబడాలంటే మస్కారా తప్పనిసరిగా కళ్లకు వేసుకోవాలి. లిప్స్ స్టిక్ వేసుకునే ముందుగా పెదాలను పెట్రోలియం జెల్లీతో మర్జన చేయాలి. ఆ తరువాత నేచురల్ కలర్ లిప్ స్టిక్ వేసుకోవాలి లేకపోతే కలర్ లిప్ బామ్ రాసుకున్నా అందంగానే ఉంటుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.