సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By జె
Last Modified: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (21:15 IST)

సహజసిద్ధంగా ముఖంపై నలుపు పోగొట్టుకోవడం చాలా ఈజీ..

ముఖంపై నల్లగా ఇబ్బందికరమైన మచ్చలతో చాలామంది సిగ్గుతూ తలదించుకుంటూ ఉంటారు. అయితే ఆ నలుపును అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు. అదెలాగో చదవండి. శరీర చర్మంతో పోలిస్తే ముఖ చర్మం చాలా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ముఖంపైన డస్ట్, డిస్టెల్స్, టాన్ వంటివి ఎక్కువగా ఏర్పడతాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఈ చిట్కాలను పాటించవచ్చు.
 
ముఖం కాంతివంతంగా మారాలంటే ఒక టమోటాను సగానికి కట్ చేసి చక్కెరలో డిప్ చేసి తీసుకోవాలి. చక్కెర నేషనల్ ఎక్స్‌పోయేట్‌గా పనిచేసి చర్మంపై ఉన్న డెక్సెయిల్స్, నలుపును చక్కగా తొలగిస్తుంది. ఇలా చక్కెరలో డిప్ చేసిన సగం టమోటాను శుభ్రం చేసిన ముఖానికి బాగా అప్లై చేయాలట. ఐదునిమిషాల పాటు మర్దన చేస్తే చర్మరంధ్రాలు డీప్‌గా క్లీనవుతాయి. ఇలా అప్లై చేశాక మరో పదినిమిషాలు అలాగే ఆగి ఆ తరువాత నార్మల్ వాటర్‌తో కడిగేయాలి. ఇలా స్కబ్ చేసిన తరువాత ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ముఖంపై ఉన్న నలుపు, టాన్ తొలగిపోతుంది.
 
ముఖం చాలా క్లీన్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది. ఫేస్ పాక్ ఎలా అప్లై చేసుకోవాలంటే.. ఒక గిన్నెలోకి టీ స్పూన్ శెనగపిండి, అర టీస్పూన్ అలోవీరా జెల్, రెండు టీస్పూన్ల టమోటా రసాన్ని, అర టీస్పూన్ తేనె వేసి బాగా కలవాలి. తిక్ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా టు స్టెప్‌ని పాటించడం వల్ల ముఖంపై టాన్, మృతకణాలు తొలగిపోయి ముఖం చాలా అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇలా వారానికి ఒకటిరెండుసార్లు చేస్తే చాలు. ముఖంపైన ఉన్న ఎంతటి నలుపు, మృతకణాలైనా తొలగిపోతాయి. ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.