సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (22:53 IST)

అందం కోసం తంటాలు ఎందుకు? ఇలా చేస్తే సరి...

సాధారణంగా స్త్రీలు అందంగా ఉండటం కోసం అనేక రకాలుగా తంటాలు పడుతుంటారు. రకరకాల క్రీంలు, లోషన్స్ వాడడం, బ్యూటీపార్లర్లు చుట్టూ తిరగడం చేస్తుంటారు. ఇవన్నీ చేయడం వలన కొంతకాలానికి సున్నితమైన చర్మం పాడవుతుంది. అలాకాకుండా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంచా అందాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.  
 
1. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్కువుగా మంచినీటిని త్రాగాలి. ఇలా త్రాగడం వలన చర్మం పొడిబారిపోకుండా ఎంతో తేజోవంతంగా, అందంగా కనిపిస్తుంది. ముఖంపై మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది.
 
2. క్యారెట్లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అసిడిటిని తగ్గిస్తుంది. 
 
3. బీట్ రూట్ జ్యూస్‌ను క్రమంతప్పకుండా తాగడం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ జ్యూస్ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. దీనిని తరచూ తాగడం వలన చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. 
 
4. టమోటాలను జ్యూస్ చేసి ప్రతిరోజు త్రాగడం వలన కూడా ఎంతో ఆకర్షణీయమైన చర్మాన్ని పొందవచ్చు. యాపిల్ జ్యూస్ కూడా శరీరానికి మంచిపోషణను ఇచ్చి చర్మానికి మంచి గ్లో రావటానికి సహాయపడుతుంది.
 
5. చర్మం పొడిబారకుండా ఉండటానికి సన్‌స్ర్కీన్ లోషన్ అన్ని కాలాలలోను తప్పనిసరిగా వాడాలి. దీనివలన చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మంచి మెరుపును సంతరించుకుంటుంది.