చర్మానికి మేలు చేసే పన్నీరు.. ఎలాగో తెలుసుకోండి..!
పన్నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పన్నీరు చర్మంలోని రంధ్రాలను శుభ్రం చేసి.. చర్మంలోని జిడ్డును తొలగిస్తుంది. అంతేగాకుండా నల్లటి మచ్చలకు, మొటిమలను దూరం చేసి.. మొహంపై దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. పన్నీరుకు చర్మంపై దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం ఉంది.
పన్నీరును ఫేషియల్‌కు ఉపయోగించడం ద్వారా చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. పన్నీరులోని సుగంధ పరిమళాలు మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి.
ఇది మీకు నిద్రసరిగా పట్టడానికి, లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రాత్రిపూట పన్నీరును రాసుకుని నిద్రించి.. తెల్లవారుజామున కడిగేస్తే.. ముఖంలోని మలినాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.