1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 21 జూన్ 2023 (22:57 IST)

వర్షంలో తడిసిన జుట్టు, కేశాల ఆరోగ్యానికి ఏమి చేయాలి?

hair
వర్షాకాలంలో జుట్టు రాలడం, చిట్లడం సమస్య పెరుగుతుంది. ఐతే తడిసిన జుట్టును ఈ చిట్కాల సహాయంతో ఆరోగ్యంగా చూసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి, ఇది మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షంలో తడిసిన తర్వాత షాంపూతో కేశాలను కడగాలి. జుట్టును పొడిగా ఉంచాలి, ఇలా చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
మంచి దువ్వెనను ఉపయోగించాలి, తడి జుట్టును చిక్కుతో దువ్వరాదు. వారానికి ఒకసారి పెరుగు లేదా సహజ హెయిర్ మాస్క్‌ని అప్లై చేయాలి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి జుట్టు చివర్లను కత్తిరించాలి. వర్షాకాలంలో జుట్టు సమస్యను బట్టి షాంపూని ఎంచుకోవాలి.