మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 20 జూన్ 2023 (21:09 IST)

నిమ్మకాయను సౌందర్యానికి ఉపయోగించేవారు తెలుసుకోవాల్సినవి

lemon
సౌందర్యం. సౌందర్య పోషణ కోసం మహిళలు పలు రకాలైన మార్గాలను ఆచరిస్తుంటారు. ఐతే కొందరు నిమ్మకాయలను ఉపయోగించి ముఖంపై మచ్చలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ దాని ప్రతికూలతలు చాలామందికి తెలియవు. అవేమిటో తెలుసుకుందాము. నిమ్మరసాన్ని నేరుగా చర్మంపై అప్లై చేయడం వల్ల పలు చర్మ సమస్యలు వస్తాయి. ఇప్పటికే ముఖంపై మొటిమలు ఉంటే, ముఖానికి నిమ్మకాయను రాస్తే మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.
 
నిమ్మకాయలో యాసిడ్ పరిమాణం ఎక్కువ, దాని కారణంగా చర్మం యొక్క పిహెచ్ స్థాయి మారవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మం యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.
 
నిమ్మకాయను నేరుగా ఉపయోగించడం వల్ల చర్మంపై ఎరుపు, అలెర్జీలు వస్తాయి. నిమ్మకాయను రోజూ ఉపయోగిస్తే ముఖం మెరుపు తగ్గుతుంది.