శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 7 జూన్ 2023 (21:20 IST)

ఈ చిట్కాలు పాటిస్తే శరీరం నిగనిగలాడుతుంది, ఏంటవి?

శరీరం కాంతివంతంగా, చూసేందుకు ఆకర్షణీయంగా వుండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను భాగం చేసుకుంటూ, చర్మ ఆరోగ్యానికి అవసరమైన నూనెలను వాడుతుంటే నిగారింపు వుంటుంది. అది ఎలాగో తెలుసుకుందాము. రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనెతో చర్మమంతా వారానికి ఒకసారి మర్దన చేసుకోవాలి. కలబందను వారానికి రెండుసార్లు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
 
టీ స్పూన్ కీరా జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను తింటుంటే చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం వల్ల చర్మంపై ముడుతలు రావు. విటమిన్ సి వుండే నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను తీసుకుంటే చర్మాన్ని అవి కాపాడుతాయి.