సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (12:39 IST)

స్నానానికి సబ్బులొద్దు.. సున్నిపిండి వాడండి.. అలెర్జీలు పరార్

Besan Powder
అలెర్జీలు, చర్మ సమస్యలు తొలగిపోవాలంటే.. సబ్బులకు బదులు స్నానానికి సున్నిపిండి వాడితే సరిపోతుంది. ఎందుకంటే సబ్బులు పైపై జిడ్డును మాత్రమే తొలగిస్తాయి. అంతే తప్ప చర్మ రంధ్రాల లోపల వున్న మురికిని శుభ్రం చేయలేదు. కానీ సున్నిపిండి.. అలాకాదు.. చర్మ రంధ్రాల లోపల వున్న మురికిని కూడా లాగేస్తుంది. ఎండాకాలంలో సున్నిపిండి వాడితే చెమటకాయలు, దద్దుర్లు వుండవు.
 
సున్నిపిండితో స్నానంతో శరీరం తేలికగా, హాయిగా, ఆరోగ్యంగా వుంటుంది. చర్మ వ్యాధులు రావు. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు వున్నవారు సున్నిపిండితో స్నానం చేసిన వారు కొబ్బరి నూనె రాయడంతో కాస్త ఉపశమనం లభిస్తుంది.
 
కేశాలకు శెనగిపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు, ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి. ఇక చర్మ సంరక్షణలో శెనగిపిండి ఒకగొప్ప ఔషదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొటిమలు, దానికి తాలుకూ మచ్చలు, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచ్ వంటి వాటిన్నింటిని చాలా సులభంగా తొలగిస్తుంది. 
 
స్కిన్ టైటనింగ్ కోసం ఉపయోగించే వాటిలో శెనగపిండి, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తాయి. ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా శెనపిండి రెండింటిని పేస్ట్‌లా చేసి, ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.