గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (17:07 IST)

కరోనాతో ఫైట్.. నువ్వుల నూనె.. ముక్కులో కొన్ని చుక్కలు..

కరోనా దరిచేరకుండా వుండాలంటే.. వ్యాధినిరోధక శక్తినిపెంచుకోవాలి. ఇందుకు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ ముక్కులో కొన్ని చుక్కలు వేసుకోవడం మరిచిపోకూడదు. ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి రంగరించి తాగాలి. ఎన్నో ఏళ్లుగా, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేని ఔషధంగా పనిచేస్తుంది. 
 
అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వుల నూనె లేదా వంట కోసం ఉపయోగించే కొబ్బరినూనె నోట్లో వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తర్వాత వేడినీళ్లతో నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ చేయాలి. ఇక రోజూ ఓ టేబుల్ స్పూన్ చ్యవన్ ప్రాష్ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. 
 
తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి మిశ్రమంతో కూడిన కషాయం రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తాగాలని.. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రోజూ వేడినీటిని సేవించడం మరవకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.