గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (11:41 IST)

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్ - తెలంగాణలో 36 రైళ్ల రద్దు

train
రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో 36 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరమ్మతులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జూన్ 25 నుంచి జులై 3 వరకూ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
 
రద్దు అయిన రైళ్ల వివరాలు.. 
జూన్‌ 25, 26 తేదీల్లో మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య నడిచే రైళ్లు,
జూన్‌ 24, 26 తేదీల్లో కాచిగూడ నుంచి రాయచూర్‌, మహబూబ్‌నగర్‌ వెళ్లే రైళ్ల
జూన్‌ 26 నుంచి జులై 3 వరకు కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌, సిర్పూర్‌ టౌన్‌ మధ్య నడిచే రైళ్లు
జూన్‌ 26 నుంచి జులై 2 వరకు కాజీపేట నుంచి డోర్నకల్‌, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్‌ నుంచి వికారాబాద్‌, వరంగల్‌ ప్యాసింజర్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది.