సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (23:52 IST)

హైదరాబాద్‌లోని హబ్సిగూడాలో తమ నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకా‌ష్‌- బైజూస్‌

image
దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని హబ్సిగూడా వద్ద ప్రారంభించింది.  నగరంలో ఎనిమిదివ తరగతి నుంచి నీట్‌, జెఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్‌ కోచింగ్‌, ఫౌండేషన్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ కేంద్రం ప్రారంభించారు.
 
భారీ 8888 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడవ అంతస్థు, సాయి సందీప్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ బిల్డింగ్‌, మెట్రో పిల్లర్‌ నెంబర్‌ సీ 973, 7/101, గెలాక్సీ టవర్స్‌  పక్కన, నాగేంద్ర నగర్‌, హబ్సిగూడా వద్ద ఉన్న ఈ నూతన కేంద్రంలో 11 తరగతి గదులు ఉంటాయి. ఇవి 1200 మంది విద్యార్థులకు తగిన సౌకార్యలను అందించగలవు. హైదరాబాద్‌ నగరంలో ఆకాష్‌ బైజూస్‌కు ఇది ఎనిమిదవ కేంద్రం.
 
ఈ క్లాస్‌రూమ్‌ కేంద్రం, వైద్య మరియు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల అవసరాలతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సుల అవసరాలను సైతం తీర్చనుంది. విభిన్నమైన పోటీపరీక్షలు అయినటువంటి ఒలింపియాడ్స్‌ మొదలైన వాటిలో పాల్గొనే వారికి సహాయపడే కోర్సులను అందించడంతో పాటుగా తమ బేసిక్స్‌ను సైతం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది. క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ఆకాష్‌ బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా, కంపెనీ ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభించారు.
 
నూతన కేంద్రం ప్రారంభం గురించి ఆకాష్‌ బైజూస్‌ సీఈఓ అభిషేక్‌ మహేశ్వరి మాట్లాడుతూ, ‘‘విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విద్యనందించడాన్ని మేము నమ్ముతుంటాము. కోర్సు కంటెంట్‌ పరంగా మాత్రమే కాదు, ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ విధానాలలో సమతుల్యత పాటించడం ద్వారా వైవిధ్యత చాటుతున్నాము’’అని అన్నారు. ఆకాష్‌ బైజూస్‌  రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌లో మా ఎనిమిదవ క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము.  మా  సెంటర్లలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, మెంటార్లు, కౌన్సిలర్లు ఉన్నారు’’ అని అన్నారు.