శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:15 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తెలంగాణలో ఏప్రిల్ 8న ప్రధాని పర్యటన

Modi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరుగున్న నేపథ్యంలో.. ముందస్తుగా బీజేపీ సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన తమ మనోధైర్యాన్ని పెంచుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారానికి ఆయనే శంకుస్థాపన చేస్తారని పార్టీ అంచనా వేస్తోంది. 
 
ముఖ్యంగా ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కె. కవితను ప్రశ్నించిన నేపథ్యంలో, అవినీతిపై బీఆర్‌ఎస్, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావును ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. 
 
రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కించిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) పేపర్ లీక్‌పై ఆయన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడే అవకాశం ఉంది.