మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (23:56 IST)

తెలుగు డిజిటల్‌ వేదిక ‘ఏబీపీ దేశం’ను ప్రారంభించిన ఏబీపీ నెట్‌వర్క్‌

తమ సరికొత్త డిజిటల్‌ వేదిక ‘ఏబీపీ దేశం’ ను ప్రారంభించడం ద్వారాఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా మార్కెట్‌లలో ప్రవేశిస్తున్నట్లు ఏబీపీ నెట్‌వర్క్‌ వెల్లడించింది. ప్రజలకు ముఖ్యమైన అంశాలతో కూడిన కథలను అందించడం తో పాటుగా ప్రాంతీయ అంశాల పట్ల ప్రత్యేక దృక్పథంతో తెలుగు డిజిటల్‌ వార్తా ప్రపంచంలో నూతన ఒరవడిని ఏబీపీ దేశం తీసుకురానుంది.
 
నిష్పాక్షికమైన మరియు విశ్వసనీయమైన వార్తలతో వీక్షకులకు శక్తినందించడంలో తమ నమ్మకాన్ని విస్తరించడం ద్వారా , ఏబీపీ దేశం సమాచారయుక్త, దేనినైనా స్వీకరించగలిగిన సమాజాన్ని సృష్టించాలనే సంకల్పంతో ఈ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ నూతన ఆఫరింగ్‌తో, ఏబీపీ నెట్‌వర్క్‌ను మరోమారు తమ స్ధానిక స్టోరీటెల్లింగ్‌ కోసం బలోపేతం చేయడంతో పాటుగా ప్రాంతీయ వార్తా ప్రపంచంలో పురోగతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. గత త్రైమాసంలో, ఈ నెట్‌వర్క్‌ తమిళనాడు మార్కెట్‌లోకి  తమ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌, ఏబీపీ నాడుతో ప్రవేశించింది.
 
తెలుగు ప్రజల సంస్కృతి, నైతికత, స్ఫూర్తిని పూర్తిగా ప్రతిబింబించే డిజిటల్‌ మాధ్యమంగా ఏబీపీ దేశం తమను తాము నిలుపుకుంటుంది.  తెలుగు పాఠకుల వ్యక్తిగత మరియు సమిష్టి ప్రాధాన్యతలకనుగుణంగా వ్యక్తిగతీకరించిన వార్తలనే అందించాలనే తమ లక్ష్యాన్ని దీని ట్యాగ్‌లైన్‌, ‘మన వార్తలు, మన ఊరి భాషలో!’ వెల్లడిస్తుంది. అంతేకాదు, ఏబీపీ దేశం అనే పేరు కూడా బహిరంగ, సమాచారయుక్త సమాజాన్ని సృష్టించడం ద్వారా  దేశం పట్ల తమ నిబద్ధతను ఎల్లప్పుడూ వ్యక్తీకరించడంలో  నెట్‌వర్క్‌ యొక్క అంకిత భావం, నిబద్ధత, అంగీకారం సైతం ప్రతిబింబిస్తుంది.
 
తమ ప్రయాణంలో, ప్రాంతీయ వార్తలు మరియు విషయపరిజ్ఞాన విభాగాలలో మార్గదర్శకునిగా ఏబీపీ నెట్‌వర్క్‌ అవతరించింది. వారి ప్రాంతీయ ఛానెల్స్‌ మరియు డిజిటల్‌ మాధ్యమాలు విజయవంతంగా సంబంధిత మార్కెట్‌లలో తమదైన స్థానం నిలుపుకోవడంతో పాటుగా తాము సేవలనందిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ అక్కడి సంస్కృతి, విలువలను ప్రతిధ్వనింపజేస్తుంది.
 
ఏబీపీ నెట్‌వర్క్‌ విజయవంతంగా ప్రాంతీయ ఛానెల్స్‌/డిజిటల్‌ వేదికలను పశ్చిమబెంగాల్‌ (ఏబీపీ ఆనంద), మహారాష్ట్ర(ఏబీపీ మజా), గుజరాత్‌ (ఏబీపీ అస్మిత), పంజాబ్‌(ఏబీపీ సంజా), ఉత్తరప్రదేశ్‌ మరియు ఉత్తరాఖండ్‌ (ఏబీపీ గంగ), బీహార్‌ (ఏబీపీ బీహార్‌) మరియు తమిళనాడు (ఏబీపీ నాడు) మరియు ఏబీపీ లైవ్‌- ఏబీపీ నెట్‌వర్క్‌కు చెందిన డిజిటల్‌ విభాగం ఉన్నాయి. ఏబీపీ నెట్‌వర్క్‌కు చెందిన ఎనిమిదవ ప్రాంతీయ భాషా డిజిటల్‌ పోర్టల్‌ ఏబీపీ దేశం. విప్లవాత్మక నమూనాలు, ప్రాముఖ్యతా కథనాలు, వినూత్నమైన కంటెంట్‌ మరియు వీక్షకుల ఆధారిత విధానంతో  తెలుగు వార్తా ప్రపంచంలో మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
 
ఈ ప్రకటన గురించి ఏబీపీ నెట్‌వర్క్‌ సీఈవో శ్రీ అవినాష్‌ పాండే మాట్లాడుతూ, ‘‘డిజిటల్‌ సమాచార వేదికల కోసం అత్యంత కీలకమైన వృద్ధి చోదకునిగా ప్రాంతీయ భాష నిలుస్తుంటుంది. ఇటీవలనే మేము మా ప్రాంతీయ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను తమిళ వీక్షకుల కోసం ప్రారంభించాం మరియు ఇప్పుడు  ఏబీపీ దేశంతో మా డిజిటల్‌ జాబితాను మరింత శక్తివంతం చేసుకుంటున్నాం. ఈ తెలుగు వార్తా వేదిక, అధిక నాణ్యత, వైవిధ్యమైన డిజిటల్‌ వార్తలను ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా  ప్రజలకు అందిస్తుందని, మా నెట్‌వర్క్‌ మరింతగా వృద్ధి చెందేందుకు తగిన అవకాశాలను సైతం అందిస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.