గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

జూలైలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు

జీఎస్టీ వసూళ్లతో కేంద్ర ఖజానా నిండిపోతోంది. గత నెల (జూలై)లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. ఏకంగా రూ.1.16 లక్షల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయం సమకూరింది. తాజాగా వెల్లడైన వివరాల మేరకు జూలై నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1,16,393 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 33 శాతం పెరుగుదల ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. 
 
జూలై 2021 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,16,393 కోట్లు, ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.22,197 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఐజీఎస్టీ రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.27,900 కోట్లు సహా) మరియు సెస్ రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.15,815 కోట్లతో సహా) ఉందని అధికారిక లెక్కలు తెలిపాయి. 
 
గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో వస్తుసేవల పన్ను జీఎస్టీ ద్వారా రూ.87,422 కోట్లు కాగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది. జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ రూ.22,197కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.57,864 కోట్లు, సెస్‌ ద్వారా రూ.7,790 కోట్లు వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది.