శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 జులై 2024 (21:14 IST)

తిరుపతిలో కమర్షియల్ పిఎన్జి కనెక్షన్‌ను తిరుచానూరులోని ఎడిఫై స్కూల్‌కు అందించిన ఏజి-పి ప్రథమ్ సంస్థ

image
స్వచ్ఛమైన, సమర్ధవంతమైన వంట గ్యాస్‌ని అందించే సౌలభ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న, భారతదేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఏజి&పి ప్రథమ్, తిరుచానూరులోని వైష్ణవి నగర్‌లో ఉన్న Edify స్కూల్ కిచెన్‌కి తమ తొలి వాణిజ్య PNG కనెక్షన్ ద్వారా గ్యాస్ సరఫరాని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో Edify స్కూల్ చైర్మన్ శ్రీ ప్రణీత్‌తో పాటు ఏజి&పి ప్రథమ్ సంస్థకు చెందిన సీనియర్ మేనేజ్‌మెంట్‌ పాల్గొన్నారు, PNG ఆధారితమైన వంటగది కార్యకలాపాల ప్రారంభానికి గుర్తుగా Edify స్కూల్‌లోని క్యాంటీన్లో గ్యాస్ స్టవ్‌ను వెలిగించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా ఏజి&పి ప్రథమ్ సంస్థ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛమైన వంట గ్యాస్‌ని నిరంతర సరఫరా చేయడానికి, ఏజి&పి ప్రథమ్ సంస్థ తిరుత్తణి నుండి తిరుపతికి ట్రంక్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది, ఇది తిరుపతిలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, గృహ వినియోగదారులకు ఈ గ్యాస్‌ను అందిస్తుంది.
 
శ్రీ గౌతమ్ ఆనంద్, రీజనల్ హెడ్- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఏజి&పి ప్రథమ్ సంస్థ మాట్లాడుతూ PNG వినియోగం ద్వారా వాణిజ్య సంస్థల యొక్క వంట గ్యాస్ ఖర్చుని తగ్గించగలదని భావిస్తున్నామన్నారు. "వంట గ్యాస్ వినియోగాల విషయంలో తిరుపతి నగరం, పర్యావరణ అనుకూలమైన వంట గ్యాస్ పద్ధతులను అవలంబించడం చాలా గొప్ప విషయం. Edify పాఠశాల మరియు ఏజి&పి ప్రథమ్ సంస్థల మధ్య ఈ సహకారం తిరుపతి జిల్లాలో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడంలో సంస్థ యొక్క నిబద్ధతను వెల్లడిస్తుంది. ఏజి&పి ప్రథమ్ సంస్థ యొక్క PNG కనెక్షన్‌లు పూర్తిగా సురక్షితమైనవి. LPG సిలిండర్‌ ఖర్చుతో పోలిస్తే PNG కనెక్షన్‌ తో 20-30% వరకూ డబ్బు ఆదా చేసుకోవచ్చు" అని అన్నారు.