శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (16:23 IST)

2024 కియా కార్నివాల్ రిలీజ్.. ఫీచర్స్ ఇవే

Kia
Kia
కియా కార్నివాల్ ఎమ్‌పివి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోడల్ లోపలి భాగాన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ 2024 కియా కార్నివాల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
 
2024 కియా కార్నివాల్ ఈ నెలలో దక్షిణ కొరియాలో విక్రయించబడుతోంది. 2024 ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కియా ఈ మోడల్‌ను ప్రదర్శించింది. అప్పటి నుంచి ఈ MPV కోసం కస్టమర్‌లు ఎదురుచూస్తున్నారు. 
 
కొత్త కియా కార్నివాల్ విషయానికొస్తే, లుక్స్ చాలా రిఫ్రెష్‌గా ఉన్నాయి. కొత్త ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. కియా మోటార్స్ ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేసింది. 
 
డ్యుయల్ టోన్ డ్యాష్‌బోర్డ్ వస్తోంది. సెంటర్ కన్సోల్ రీడిజైన్ చేయబడింది. ఫలితంగా, భౌతిక బటన్లు చాలా వరకు తగ్గించబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయల్ టోన్ సెటప్ ఉంది. 
 
ఇది ఇప్పటికే సెల్టోస్, కరెన్స్‌లో ఉంది. ఈ వాహనంలో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఇవి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేగా పని చేస్తాయి. 
 
ఈ 2024 కియా కార్నివాల్ ఎమ్‌పివిలో హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, బోస్ సరౌండ్ స్పీకర్లు, వెంటిలేటెడ్ సీట్లు వస్తాయని సమాచారం. 
 
భద్రత విషయానికొస్తే, ఈ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్‌లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, హైవే డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సెమీ అటానమస్ డ్రైవ్‌తో పాటు ADAS ఉండవచ్చు.
 
ఎక్ట్సీరియర్ విషయానికొస్తే, కియా కార్నివాల్, కొత్త మోడల్‌లో హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లలో మార్పులు ఉన్నాయి. కియా గ్రిల్‌ను సిగ్నేచర్ LED DRLలు, T-ఆకారపు స్టైలింగ్‌తో కూడా అప్‌డేట్ చేసింది. బంపర్- టెయిల్ గేట్ కూడా మార్చబడ్డాయి.