కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న ఆనంద్ మహీంద్రా
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటై మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ హోదా నుంచి తప్పుకున్నారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అయితే, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా ఆయన వ్యవహరించనున్నారు.
అదేసమయంలో ఆనంద్ మహీంద్రా స్థానంలో పవన్ గోయెంకా ఎండీగా పునర్నియమితులవుతున్నారు. ఆయన ప్రస్తుతం సీఈవోగానూ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు ఏడాదిపాటు తీవ్ర కసరత్తులే చేసింది. ఇందుకోసం నామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.