కెనెరా బ్యాంకు సూపర్ ఆఫర్.. 7.85% వడ్డీకే బంగారంపై రుణాలు

Gold
Gold
సెల్వి| Last Updated: మంగళవారం, 19 మే 2020 (10:35 IST)
బంగారాన్ని తక్కువ వడ్డీకి వుంచి రుణాలు పొందాలనుకుంటున్నారా..? అయితే కెనెరా బ్యాంకును సంప్రదించండి. అవును. కరోనా కష్టకాలంలో బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలనుకంటే.. కెనెరా బ్యాంకు తక్కువ వడ్డీ కింద రుణాలు అందిస్తోంది. వ్యాపారాలు చేసేవారు నగదు కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ఆఫర్ ప్రకటించింది.

ఈ రుణాలును సులువుగా, వేగంగా తక్కువ వడ్డీకే మంజూరు చేస్తామంటోంది కెనెరా బ్యాంకు. లాక్‌డౌన్ వల్ల మూతపడ్డ వ్యాపారాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని బ్యాంకు చెబుతోంది. వడ్డీ వార్షికంగా 7.85% మాత్రమే. వ్యాపారులు ఈ రుణాలను వ్యవసాయ పనులకు, వ్యాపార కార్యకలాపాలకు, ఆరోగ్య అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

రూ.40లక్షల వరకు 7.85 శాతానికి (65పైసలు వడ్డీ కింద) రుణాలను ఇవ్వనున్నట్లు కెనెరా బ్యాంకు ప్రకటించింది. ఇందుకు ఎలాంటి భూముల దస్తావేజులు అవసరం లేదు. అయితే సంవత్సరానికి ఓసారి తప్పకుండా వడ్డీని చెల్లించాల్సి వుంటుంది. రూ.20లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం వున్నట్లు కెనెరా బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :