1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (19:20 IST)

కార్డు లేకుండానే ఏటీఎంలలో నగదు విత్ డ్రా

cash
కార్డు లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. 
 
శుక్రవారం 2022-23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటననుఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్డ్‌లెస్ విత్‌డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తున్నాయని చెప్పారు.
 
అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్టు శక్తికాంత్ చెప్పారు. దీని ద్వారా కార్డ్ స్కిమ్మింగ్‌, కార్డ్ క్లోనింగ్ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చు అని అన్నారు.