గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (11:34 IST)

స్పైస్‌జెట్‌లో కొలువుల కోత : 1400 మందిని ఇంటికి పంపుతున్న ఎయిర్‌లైన్

spicejet
స్పైస్‌జెట్‌లో ఉద్యోగులను తొలగించనున్నారు. యేడాదికి రూ.100 కోట్లు ఆదా చేయడమే లక్ష్యంగా ఆ సంస్థ చర్యలు చేపట్టనుంది. జనవరి నెల వేతనాలు కోసం ఉద్యోగులు ఎదురుచూపులు చేస్తున్నారు. ఇప్పటికే తొలగింపు నోటీసులు జారీ చేస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్న ఇన్వెస్టర్లు ఉన్నారు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించలేనంత ఆర్థిక సమస్యలు చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట కొలువుల కోత మొదలుపెట్టింది. 
 
నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం అంటే దాదాపు 1400 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. తమ టర్న్ అరౌండ్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహంలో భాగంగా లాభదాయక వృద్ధి సాదించడం, భారతీయ విమానయాన పరిశ్రమలోని అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమను తాము నిలబెట్టుకోవడం కోసం స్పైస్‌జెట్ హేతుబద్ధీకరణ సహా అనేక చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా యేడాది రూ.100 కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
స్పైస్‌జెట్‌‍లో ప్రస్తుతం 9 వేల మంది ఉద్యోగులున్నాయి. 30 విమానాలు నిర్వహిస్తుంది. వేతనాల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తుండగా దానిని తగ్గించుకునే వ్యూహంలో స్పైస్‌జెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీచేసినట్టు సమాచారం. స్పైస్‌జెట్ గత కొన్ని నెలలుగా వేతనాల కోసం ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించలేనంత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం అంటే దాదాపు 1400 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. 
 
తమ టర్న్ అరౌండ్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహంలో భాగంగా లాభదాయక వృద్ధి సాధించడం, భారతీయ విమానయాన పరిశ్రమలోని అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమను తాము నిలబెట్టుకోవడం కోసం స్పైస్‌జెట్ హేతుబద్ధీకరణ సహా అనేక చర్యలు ప్రారంభించిందని, దీని ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019లో స్పెసెట్ 118 విమానాలు, 16 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాని సమీప ప్రత్యర్థి ఆకాశ ఎయిర్ 3,500 మంది ఉద్యోగులతో 23 విమానాలు నిర్వహిస్తోంది. దేశీయ విమాన మార్కెట్లో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉంది.