దేశంలో చేపట్టనున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు ఇవే...
దేశంలో మరో ఏడు మార్గాల్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును చేపట్టారు. 508.17 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు వచ్చే 2028 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టుపై స్థల సేకరణతో పాటు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పడింది. ఆ కారణంగానే 2023 నాటికి పూర్తకావాల్సిన ప్రాజెక్టు 2028కి పూర్తికానుంది.
ఇవికాకుండా, 865 కిలోమీటర్ల దూరం ఢిల్లీ - వారణాసి, 753 కిలోమీటర్ల దూరం కలిగిన ముంబై - నాగ్‌పూర్ మార్గం, 459 కిలోమీటర్ల మార్గం కలిగిన ఢిల్లీ - అమృతసర్, 711 కిలోమీటర్ల పొడవు కలిగిన ముంబై - హైదరాబాద్, 886 కిలోమీటర్ల దూరమున్న ఢిల్లీ - అహ్మదాబాద్, 435 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నై - మైసూర్, 760 కిలోమీటర్ల దూరం కలిగిన వారణాసి - హౌరా మార్గాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్రం 10 ట్రిలియన్ కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాల్సిందిగా కేంద్రం కోరినట్టు సమాచారం.