శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (17:41 IST)

ఖాతాలో డబ్బులు లేకున్నా ఏటీఎం కార్డు వినియోగిస్తున్నారా...?

చాలా మంది బ్యాంకు ఖాతాలో సరైన మోతాదులో నగదు నిల్వ లేకపోయినప్పటికీ ఏటీఎం కార్డును స్వైప్ చేస్తుంటారు. ఇలాంటి వారి నుంచి బ్యాంకులు అపరాధం రుసుంను వసూలు చేస్తున్నాయి. ఈ విధానం ఎన్నో నెలల నుంచి అమల్లోవుంది. కానీ, చాలా మందికి తెలియదు. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడమే. 
 
అందుకే బ్యాంకింగ్ రంగ నిపుణులు ఓ హెచ్చరిక చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలో సరిపడనంత డబ్బులు లేనిపక్షంలో ఏటీఎం కార్డును స్వైప్ చేయొద్దని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఖాతాలో డబ్బులు లేకున్నా ఏటీఎం కార్డులను వినియోగిస్తే.. బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తాయని హెచ్చరిస్తున్నారు.
 
బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైన సందర్భాల్లో దేశంలోని వివిధ బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా వినియోగిస్తే ఎస్బీఐ రూ.20లతోపాటు జీఎస్టీ వసూలు చేస్తోంది. అలాగే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్, యాక్సిస్, మహేంద్ర బ్యాంకులు రూ.25లతోపాటు జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. 
 
ఇలాంటి ఛార్జీలపై వినియోగదారులు పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సలహా ఇస్తున్నారు. ఏటీఎం సెంటర్ కనబడగానే ట్రాన్సాక్షన్ చేయకుండా ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో గుర్తుంచుకోని లావాదేవీలు చేయాలని వారు సూచిస్తున్నారు.