1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (11:46 IST)

చెన్నై నుంచి తిరుపతికి 30 నిమిషాల్లోనే రైలు

చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగారాలకు వెళ్లే రైళ్ల వేగం పెంచేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అరక్కోణం-రేణిగుంట మార్గంలో రూ.9.45 కోట్లతో 67 కి.మీ మేర రైలు మార్గాన్ని పటిష్ఠ పరచి, ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. 
 
దీంతో, ఇప్పటివరకు ఆ మార్గంలో 105 నుంచి 120 కి.మీ వేగంతో నడిచే రైళ్లు ప్రస్తుతం 130 కి.మీ వేగంతో నడువనున్నాయి. దీంతో, చెన్నై నుంచి తిరుపతి, ముంబై వెళ్లే రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు ముందుగానే గమ్యస్థానాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.