శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 మే 2020 (23:17 IST)

భారతదేశంలో మొట్టమొదటి బ్లూ రే క్రిమిసంహారక యంత్రము

హాంకాంగ్‌కు చెందిన చిల్లి ఇంటర్నేషనల్ కంపెనీ, భారతదేశంలో తొలిసారిగా కిల్లర్ 100 బ్లూ రే క్రిమిసంహారక యంత్రాన్ని విడుదల చేసింది. ఇది తక్కువ బరువు కలిగిన, ఒక బహుళార్ధసాధక యంత్రం, కిల్లర్ 100, గృహము, కార్యాలయం, మాల్, కారు లేదా వ్యక్తిగతంగా, అసమాన క్రిమిసంహారక కోసం చాలా అనువైనది. 
 
చిల్లి ఇంటర్నేషనల్ యొక్క ప్రత్యేకమైన మోడల్, కిల్లర్ 100 జపాన్లో రూపొందించబడింది మరియు చైనాలో కూర్చబడింది. ఈ ఉత్పాదనతో జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కిల్లర్ 100 బ్లూ రే క్రిమిసంహారక యంత్రం నిమిషానికి 22 మి.లీ స్ప్రే చేసే సామర్ధ్యంతో 280 మి.లీ బాటిల్ కలిగి ఉంటుంది. 
 
ఇది 1300 వాట్ల శక్తితో పనిచేస్తుంది. దీనిని వినియోగించడానికి ఇది ముందుగా వేడి కావడానికి 1 నిమిషం సమయం అవసరం. క్రిమిసంహారక యంత్రం కనీసం 2-3 అడుగుల దూరం నుండి పిచికారీ చేయవచ్చు, అప్పుడు ఇది మానవ చర్మంపై వాడటానికి అనువుగా ఉంటుంది. వైద్య నిపుణుడు లేదా వైద్యుడు సూచించిన ద్రవ క్రిమిసంహారక మందుతో కూడా ఉపయోగించవచ్చు. 
 
చిల్లి ఇంటర్నేషనల్ హోల్డింగ్ (హెచ్‌కె) లిమిటెడ్ సిఇఒ సుఫియాన్ మోతివాలా మాట్లాడుతూ, “ఈ ఉత్పాదనను ఏర్పాటుచేయడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి మరియు ప్రతి ఒక్కరినీ – వారు వ్యక్తులైనా లేదా సంస్థలైనా - వారు ఇంతకుమునుపటి జీవితాన్ని గడిపేలా చేయడం. ఇది భారతీయ మరియు అంతర్జాతీయ నిపుణుల సమిష్టి కృషి ఫలితమే. ప్రస్తుతం, భారతదేశంలో వచ్చే రెండు నెలల్లో 100 కె యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
 
నాణ్యమైన ఉత్పత్తులను వారంటీతో అందించడం ఎల్లప్పుడూ మా ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. 3ఎం & వీనస్ మాస్క్ తయారీ మార్కెట్లో ఉన్నందున, మేము క్రిమిసంహారక యంత్రానికి ప్రత్యామ్నాయంగా మార్చడంపై దృష్టి కేంద్రీకరించాము. రాబోయే కాలంలో ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై దృష్టి సారించిన ఇలాంటి వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాలను మేము ప్రారంభిస్తాము.”
 
ఈ కీలకమైన సమయాల్లో ఉత్పత్తులు, వినియోగదారులను గరిష్ట సంఖ్యలో చేరుకోవడానికి వీలుగా అన్ని ప్రముఖ ఇ-కామర్స్ ఛానెళ్లలో ఉత్పత్తులను ప్రారంభించాలని ఈ బ్రాండ్ యోచిస్తోంది. ఫ్లిప్ కార్ట్ & అమెజాన్ వంటి అన్ని వేదికలలో తన లభ్యతను నిర్ధారించడానికి ఈ పరిశ్రమలోని ప్రముఖ సంస్థలలో ఒకటైన స్టాంచ్‌తో కంపెనీ సంబంధం కలిగి ఉంది, దీని ధర రూ. 6999/- లు, అన్ని పన్నులను కలుపుకొని.