సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:29 IST)

ప్రీమియం ఎస్‌యువీలు, వాణిజ్య వాహనాల కోసం నూతన శ్రేణి టైర్లను విడుదల చేసిన కాంటినెంటల్‌ టైర్స్‌

image
సుప్రసిద్ధ ప్రీమియం టైర్‌ తయారీదారు కాంటినెంటల్‌ టైర్స్‌, తమ మోడిపురం ప్లాంట్‌ వద్ద ప్యాసెంజర్‌, వాణిజ్య వాహన విభాగాల కోసం పలు నూతన ఆర్టికల్స్‌ను  తయారుచేయడం ప్రారంభించింది. కంపెనీ యొక్క స్థానికీకరణ కార్యక్రమాలకు అనుగుణంగా ఇది ఉండటంతో పాటుగా భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి ఇది మద్దతునందిస్తుంది. కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా ఇప్పుడు ప్రీమియం సెడాన్స్‌ మరియు ఎస్‌యువీల కోసం 19 అంగుళాలు, 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ ఆర్టికల్స్‌ను తయారుచేస్తుంది. అంతేకాదు, ఈ కంపెనీ ఇప్పుడు డిజిటల్‌ పరిష్కారాలను సైతం పరిచయం చేసింది. భారతదేశంలో వాణిజ్య వాహన విభాగం కోసం కాంటి360 ఫ్లీట్‌ సొల్యూషన్స్‌కు ఇది అదనపు విలువ జోడిస్తుంది.
 
భారతీయ ప్యాసెంజర్‌ వాహన విభాగం గత కొద్ది సంవత్సరాలుగా ఎస్‌యువీ టైర్ల కోసం డిమాండ్‌ను అందుకుంటుంది. వాణిజ్య వాహన విభాగంలో ఫ్లీట్‌ యజమానులు తమ వాహనాల పనితీరును ఒకే ఒక్క, క్రమబద్దీకరించిన ఛానెల్‌ ద్వారా పర్యవేక్షించడంలో తోడ్పడే పరిష్కారాలను కోరుకుంటున్నారు. తద్వారా అతి సులభంగా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా అత్యుత్తమ లాభదాయకతకూ తోడ్పడాలనుకుంటున్నారు. కాంటినెంటల్‌ యొక్క నూతన ఉత్పత్తులు మారుతున్న భారతీయ వినియోగదారుల టైర్ల అవసరాలను తీర్చనున్నాయి.
 
ఈ నూతన  ఉత్పత్తులను విడుదల చేయడం గురించి కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సెంట్రల్‌ రీజియన్‌ బీఏ పీఎల్‌టీ ఆర్‌ఈ ఏపీఏసీ హెడ్‌ సమీర్‌ గుప్తా మాట్లాడుతూ, ‘‘ మాకు ఇండియా అత్యంత కీలకమైన మార్కెట్‌.  భారతదేశంలో మేము స్ధిరంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ‘ఇన్‌ ద మార్కెట్‌, ఫర్‌ ద మార్కెట్‌’ వ్యూహంతో  మా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నాము. ఎస్‌యువీలు, ప్రీమియం వాహన విభాగాల కోసం అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌ 19 అంగుళాలు మరియు 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ టైర్లను స్ధానికంగా ఉత్పత్తి చేయాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా, వాణిజ్య వాహనాల కోసం డిజిటల్‌ పరిష్కారాలను అందించాలనే మా ప్రయత్నాలు భారతీయ మార్కెట్‌ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా వైవిధ్యమైన భారతీయ రోడ్డు వాతావరణానికి తగినట్లుగా నాణ్యమైన టైర్లను అందిస్తుంది. నూతనంగా, స్థానికంగా తయారుచేసే ఆర్టికల్స్‌ మాకు పోటీ ప్రయోజనం అందించడంతో పాటుగా మారతున్న, అభివృద్ధి చెందుతున్న భారతదేశపు టైర్ల అవసరాలను సైతం తీర్చగలవనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.
 
ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గురించి కుల్దీప్‌ సింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కాంటినెంటల్‌ టైర్స్‌, ప్లాంట్‌ మోడీపురం, మాట్లాడుతూ ‘‘మోడీపురం వద్ద మా బృందాలు ఆర్‌ అండ్‌ డీ బృందంతో కలిసి పనిచేయడంతో పాటుగా భారతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చేందుకు వినూత్నమైన, నూతన పరిష్కారాలను సృష్టించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. ఈ ఫలితాల పట్ల మేము సానుకూలంగా ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మోడీపురం ప్లాంట్‌ వద్ద స్థానికంగా  నూతన మరియు వినూత్న ఉత్పత్తులను ఉత్పత్తి చేసే నైపుణ్యం మెరుగుపరిచింది’’అని అన్నారు.