శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 జులై 2023 (22:15 IST)

పయనీర్ సీడ్స్ పరిష్కారాలను వేడుక చేస్తున్న కార్టెవా

image
గ్లోబల్ ప్యూర్-ప్లే అగ్రికల్చర్ కంపెనీ, కార్టెవా అగ్రిసైన్స్, ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతదేశంలో పయనీర్ సీడ్స్ యొక్క 50 సంవత్సరాల వారసత్వాన్ని వేడుక చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, దశాబ్దాలుగా పయనీర్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న రైతులతో పాటు వ్యవసాయంలో సానుకూల సహకారం అందిస్తున్న మహిళా రైతులను కూడా కార్టెవా అభినందించింది. వ్యవసాయాన్ని విధానాలను మార్చడంలో, దిగుబడి & ఉత్పాదకతను పెంపొందించడానికి తోటి రైతులతో విజ్ఞానం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంలో నిరంతర కృషి చేసిన  రైతు రాయబారులుగా-కార్టెవా ప్రవక్తాస్ గుర్తింపు పొందారు.
 
కార్టెవా భారతదేశంలో తమ ప్రయాణాన్ని 1972లో పయనీర్ సీడ్స్ ఏర్పాటుతో ప్రారంభించింది. మొక్కజొన్న, వరి, మిల్లెట్ మరియు ఆవాలతో సహా కీలక పంటలలో హైబ్రిడ్ విత్తనాలను అభివృద్ధి చేయడం మరియు వర్గీకరించటం ద్వారా దేశంలోని ప్రముఖ సరఫరాదారులలో ఒకరిగా పయనీర్ కొనసాగుతుంది. కార్టెవా హైబ్రిడ్ రకాలు రైతులకు దిగుబడిని పెంచడానికి, స్థిరమైన ఆహార సరఫరాను నిర్వహించడానికి, ఆహార భద్రతను పెంచడానికి సహాయపడతాయి.
 
పయనీర్ యొక్క శాశ్వతమైన లెగసీ బ్రాండ్‌పై తన ఆలోచనలను పంచుకున్న కార్టెవా అగ్రిసైన్స్ సీడ్ బిజినెస్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టిమ్ గ్లెన్ మాట్లాడుతూ “మా విత్తన సాంకేతిక పరిజ్ఞానం యొక్క శక్తి మరియు రైతుల పట్ల ఉన్న అంకితభావం వల్ల భారతదేశంలో కార్టెవా విజయం సాధించింది. మా స్థిరమైన విత్తన పోర్ట్‌ఫోలియో ద్వారా, విత్తన ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశాన్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. పెరిగిన ఆర్ అండి డి పెట్టుబడులతో, మేము రైతుల ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని పురోగమింపజేసే వ్యవసాయ ఆవిష్కరణలను పరిచయం చేయడం కొనసాగిస్తూనే ఉంటాము" అని అన్నారు. 
 
అంతర్జాతీయ విత్తన బ్రాండ్ పయనీర్‌తో, కార్టెవా అగ్రిసైన్స్ భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చేయడంతో పాటుగా రైతులకు స్పష్టమైన ఫలితాలను తీసుకువస్తోంది. ఈ విత్తనాలు మొత్తం పంట దిగుబడిని పెంచడమే కాకుండా పంట ఉత్పాదకతను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ మిషన్‌కు దోహదం చేస్తుంది.
 
తెలంగాణలో ఆర్ అండ్ డి సదుపాయాన్ని-మల్టీ క్రాప్ రీసెర్చ్ సెంటర్‌ని కార్టెవా స్థాపించింది. ఈ పరిశోధనా సౌకర్యం మొక్కజొన్న, మిల్లెట్ మరియు ఆవాలు వంటి కీలక పంటలలో బ్రీడింగ్ మరియు బ్రీడింగ్ టెక్నాలజీ విస్తరణలో సారూప్యతలను తీసుకువస్తుంది. ఈ సదుపాయం మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి టెక్నాలజీ హబ్‌గా పనిచేస్తుంది.
 
వ్యవసాయ రంగం పట్ల తమ విజన్ గురించి  తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి  శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ “భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్టెవా యొక్క పయనీర్‌నుమేము అభినందిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయాన్ని మెరుగుపరిచే, రైతులకు అవసరమైన వనరులను అందించే విధానాలు మరియు కార్యక్రమాలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం మరియు సహకారం రైతులకు తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగ్గా పొందడానికి మరియు పర్యావరణ పద్ధతులను అవలంబించడానికి సహాయపడుతోంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు మొత్తం వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి విలువ జోడింపును ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలకు మేము మద్దతునిస్తూనే ఉంటాము " అని అన్నారు.