శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (21:14 IST)

దాల్మియా సిమెంట్ రూ. 360 కోట్లతో బెంగాల్‌ సిమెంట్‌ వర్క్స్‌యూనిట్‌ వద్ద 2.3 ఎంటీపీఏ

సుప్రసిద్ధ భారతీయ సంస్థ మరియు దాల్మియా భారత్‌ లిమిటెడ్‌కు అనుబంధమైన దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ ఇప్పుడు తమ బెంగాల్‌ సిమెంట్‌ వర్క్స్‌ (బీసీడబ్ల్యు)కు 2.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంను 360 కోట్ల రూపాయల పెట్టుబడితో జోడించినట్లు వెల్లడించింది. ఈ జోడింపు మా వ్యాపార మూలస్తంభం ‘వృద్ధి’కి అనుగుణంగా ఉంది. ఈ జోడింపుతో బీసీడబ్ల్యు మొత్తం సామర్థ్యం వార్షికంగా 4 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.
 
ఈ సామర్థ్య జోడింపుతో, బీసీడబ్ల్యు యూనిట్‌ ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో అతిపెద్ద సిమెంట్‌ ప్లాంట్‌గా మారుతుంది. ఈ జోడింపు అనేది మా వ్యాపార మూలస్తంభాలైనటువంటి ‘సుస్థిరిత’మరియు ‘పరపతి’కి అనుగుణంగా ఉండటంతో పాటుగా రాష్ట్రంలో అత్యంత   స్థిరమైన ప్లాంట్స్‌లో ఒకటిగా మారుస్తుంది. ఇది ఉపాధి అవకాశాలను అందించడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి సైతం తోడ్పడుతుంది.
 
కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో, సిమెంట్‌ డిమాండ్‌ ఇప్పుడు స్థిరంగా అందుబాటు ధరలలోని గృహ, మెగా రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులలో వేగం పెరుగుతుందని అంచనా. దీనితో పాటుగా భారతదేశపు ఆత్మనిర్భర్‌ లక్ష్యాలు కూడా జోడించబడటంతో దేశంలో సిమెంట్‌ వినియోగపరంగా డిమాండ్‌ పెరిగింది. ఈ జోడింపుతో, డీసీబీఎల్‌ ఇప్పుడు స్థిరంగా జాతి నిర్మాణం చేయడంతో పాటుగా దేశంలో తూర్పు మరియు ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి డిమాండ్‌ తీర్చడానికి సైతం తోడ్పడుతుంది.
 
పశ్చిమబెంగాల్‌లో ఈ సిమెంట్‌ ప్లాంట్‌ జోడింపు గురించి శ్రీ  ఉజ్వల్‌ బాట్రియా, సీఓఓ, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ముందుగా , పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మరియు సల్బోనీ ప్రాంత ప్రజలకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాము. వారి నిరంతర మద్దతు కారణంగానే మేము బెంగాల్‌ వృద్ధి కథలో భాగం కాగలిగాము. ఈ ప్రాజెక్ట్‌ కింద, ఇప్పుడు మేము4.0 మిలియన్‌ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంను బెంగాల్‌ సిమెంట్‌ వర్క్స్‌, మిడ్నాపూర్‌ వద్ద సంతరించుకున్నాం.
 
మేము ఈ జోడింపు కోసం అత్యాధునిక యంత్రసామాగ్రి మరియు సాంకేతికతను జోడించాము. ఇక్కడ కేవలం 100% బ్లెండెడ్‌ సిమెంట్‌ మాత్రమే మేము ఉత్పత్తి చేస్తాము. తద్వారా ఈ ప్రాంతంలో కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ సైతం 2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌గా మారాలనే నిబద్ధతలో భాగంగా తగ్గించగలుగుతున్నాం. ఈ జోడింపుతో సిమెంట్‌కు ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్‌ను తీర్చడంతో పాటుగా తగిన మరియు సమయానికి తగిన సరఫరా చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల వృద్ధికి తోడ్పడగలం’’ అని అన్నారు.
 
‘‘భారతదేశవ్యాప్తంగా దాల్మియా సిమెంట్‌ యొక్క ఉనికితో, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత డిమాండ్‌ను విప్లవాత్మక రవాణా పరిష్కారాలను అందించడం ద్వారా ఈ మార్కెట్‌లకు మద్దతునందించేందుకు సిద్ధమయ్యాము. గ్రీన్‌ సిమెంట్‌ ప్లాంట్స్‌ను డీసీబీఎల్‌ నిర్మించడం కొనసాగించడంతో పాటుగా సస్టెయినబిలిటీ లో అంతర్జాతీయ ప్రమాణాలను సైతం చేరుకోవడంలో సహాయపడనుంది’’ అని శ్రీభాట్రియా జోడించారు.
 
అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌ డీసీబీఎల్‌. నూతన ఆలోచనలు మరియు పరిష్కారాలకు ఇది తెరువబడి ఉండటంతో పాటుగా వృద్ధి చేయబడిన ఉత్పత్తికి సైతం  మద్దతునందిస్తుంది. పలు నూతన నాణ్యత నియంత్రణ ప్రక్రియలు మరియు సాంకేతికతలను ప్లాంట్‌ వద్ద అమలు చేయడం ద్వారా ఎలాంటి మానవజోక్యం లేదనే భరోసా అందిస్తుంది. అత్యున్నతస్థాయి ముడిపదార్ధాలను ఇది మిళితం చేసుకోవడం వల్ల, మొత్తంమ్మీద సిమెంట్‌ ఔట్‌పుట్‌ పరంగా నాణ్యత సైతం మెరుగుపడుతుంది. అంతేకాదు, ఆన్‌లైన్‌ పార్టికల్‌ సైజ్‌ ఎనలైజర్‌, సమానంగా పార్టికల్‌ పరిమాణం వృద్ధి చెందుతుందనే భరోసా అందించడంతో పాటుగా కాంక్రీట్‌ను మరింత మందంగా, అత్యున్నతంగా ప్రతిస్పందించేలా తీర్చిదిద్దింది.