శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (23:10 IST)

డెర్మా హీల్‌ను ఆవిష్కరించిన డాక్టర్‌ బాత్రాస్: చుండ్రు, గజ్జి, బొల్లి, సోరియాసిస్‌కి చెక్

నివారణ మరియు ప్రభావవంతమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను ప్రతిరోగికీ అందించాలనే ప్రయత్నంలో భాగంగా డాక్టర్‌ బాత్రాస్‌ ఇప్పుడు హోమియోపతి భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులను శాస్త్రీయ, ఖచ్చిత, సురక్షిత, వినూత్నమై చికిత్సా పరిష్కారాల ద్వారా తీసుకురాబోతుంది. తమ తాజా ఆఫరింగ్‌ ద్వారా, డాక్టర్‌ బాత్రాస్‌ ఇప్పుడు డెర్మా హీల్‌ను తీసుకువచ్చింది. రోగులకు నొప్పి లేని రీతిలో చర్మ సంరక్షణ పరిష్కారాలను అతి సులభంగా అందించనున్న మొట్టమొదటి చికిత్స విధానం ఇది.
 
విప్లవాత్మక చర్మ సంరక్షణ చికిత్స-డెర్మా హీల్‌లో యువీబీ కాంతి కిరణాల చక్కదనం మరియు హోమియోపతి యొక్క విశిష్టత మిళితమవుతుంది. దీని ద్వారా చర్మ వ్యాధులను సురక్షితంగా, సహజసిద్ధంగా చికిత్స చేయవచ్చు. ప్రతి డెర్మా హీల్‌ సదస్సు కూడా 30 నిమిషాల సమయం తీసుకుంటుంది మరియు సుశిక్షితులైన థెరపిస్ట్‌లు దీనిని నిర్వహిస్తారు. దీనికి అర్హత కలిగిన హోమియోపతిక్‌ డెర్మటాలజిస్ట్‌లు మార్గనిర్ధేశనం చేస్తారు. దాదాపు 400కు పైగా క్లీనికల్‌ పరిశోధనల ద్వారా నిరూపితమైన సామర్థ్యంతో ఈ చికిత్సా పద్ధతులు చర్మ సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడంతో పాటుగా కేవలం ఐదు వారాలలో అత్యుత్తమ ఫలితాలనూ అందిస్తాయి.
 
నారోబ్యాండ్‌ యువీబీ ఫోటోథెరఫీని డెర్మా హీల్‌ వినియోగించుకుంటుంది. నిర్థుష్టమైన అల్ట్రావయొలెట్ (యువీ) రేడియేషన్‌ను నారోబ్యాండ్‌ సూచిస్తుంది. ఇది సాధారణంగా 311 నుంచి 312 ఎన్‌ఎం ఉంటుంది. ఈ శ్రేణి యువీ రేడియేషన్‌, చర్మ సమస్యలు అయినటువంటి సొరియాసిస్‌, బొల్లి , తామర, చుండ్రు, దురద, సూరీడుకాయలు వంటి వాటి చికిత్సకు తోడ్పడుతాయి.
 
డెర్మా హీల్‌ ఆవిష్కరణ గురించి డాక్టర్‌ అక్షయ్‌ బాత్రా, వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ బాత్రాస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అండ్‌ ఫెలో-హోమియోపతిక్‌ డెర్మటాలజీ (మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎంయుహెచ్‌ఎస్‌) మాట్లాడుతూ, ‘‘రోగికి ప్రధమ ప్రాధాన్యం అనే సిద్ధాంతంతో, మేము డాక్టర్‌ బాత్రాస్‌ వద్ద మా రోగులకు అత్యాధునిక వైద్య ఆవిష్కరణలను అందించడానికి ప్రయత్నించడం ద్వారా మెరుగైన చికిత్సా ఫలితాలను సాధిస్తున్నాము. డెర్మా హీల్‌ ద్వారా, మేము చికిత్సా ఫలితాలను 96% వరకూ వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. సంప్రదాయ చికిత్సా పద్ధతులలో కేవలం 60% మాత్రమే ఫలితాలను సాధించగలం’’ అని అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘చర్మ సమస్యలు కేవలం శారీరకంగా మాత్రమే ఇబ్బంది పెట్టడం కాకుండా అవి అతి సులభంగా అందరికీ కనబడుతుంటాయి. అవి రోగుల ఆత్మవిశ్వాసంపై కూడా ప్రభావం చూపుతాయి. చర్మ సమస్యలకు చికిత్స తీసుకునే ఎంతోమంది రోగులు కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలనూ పొందుతుంటారు. డెర్మా హీల్‌ అనేది కేవలం నొప్పి లేని చికిత్స మాత్రమే కాదు, వేగవంతమైన ఫలితాలనూ అందిస్తుంది. అంతేకాకుండా దీని వల్ల దుష్పరిణామాలూ ఉండవు’’ అని అన్నారు.
 
యువీబీ మరియు హోమియోపతి యొక్క చక్కదనం ద్వారా, డెర్మా హీల్‌ ఈ దిగువ నిరూపిత ఫలితాలను పొందవచ్చు:
 
బొల్లి : నారోబ్యాండ్‌ యువీబీ ఫోటోథెరఫీ ద్వారా నిద్రాణమైన చర్మ మెలనోసైట్స్‌ను మేల్కొలపడంతో పాటుగా క్యుటనియస్‌ (చర్మ సంబంధిత) రోగ నిరోధక శక్తినీ మాడ్యులేట్‌ చేయవచ్చు. తద్వారా చర్మం యొక్క సహజ రంగును తిరిగి పొందవచ్చు.
 
సొరియాసిస్‌: ఈ ఫోటో థెరఫీ విధానంలో అల్ట్రావయొలెట్ కిరణా(యువీ)లు మందాన్ని తగ్గించి, చర్మపు యొక్క ఎర్రదనం, పొలుసు బారడం కూడా తగ్గించి నూతన చర్మ కణాలు ఏర్పడాన్ని నెమ్మదింపజేస్తుంది.
 
గజ్జి: డెర్మా హీల్‌ థెరఫీ ద్వారా చర్మంలో తాపజనక ప్రతిస్పందన తగ్గుతుంది. అది కణ విభజననూ ప్రభావితం చేస్తుంది. తద్వారా దురద, చర్మం మందంగా మారడం తగ్గుతుంది.
 
చుండ్రు: తీవ్రంగా చుండ్రు ఉన్నప్పుడు ఇతర చికిత్సలు కూడా పనిచేయవు. యువీబీ లైట్‌ చికిత్స ద్వారా అధిక దురద తగ్గి, చుండ్ర పొట్టు రాలడం తగ్గిస్తుంది. తద్వారా ప్రభావవంతమైన రీతిలో, సురక్షితంగా దీనికి పరిష్కారమూ అందిస్తుంది.