గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (13:22 IST)

యస్ బ్యాంక్ వ్యవహారం.. రానా కపూర్ అరెస్ట్.. ఈడీ జోక్యం ఎందుకు?

Rana Kapoor
యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ అరెస్టయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రానా కపూర్‌ను అరెస్ట్ చేశారు. సాధారణంగా నగదు అక్రమ మార్గంలో విదేశాలకు తరలిన కేసుల్లోనే ఈడీ జోక్యం వుంటుంది. ఇదే నేరానికి రానా కపూర్ పాల్పడినట్లుగా ఈడీ కేసు రాసింది. 
 
యెస్ బ్యాంకులో అవకతవకలు జరిగాయని వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల పాటు రానా కపూర్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. శుక్రవారం సాయంత్రం ముంబైలోని ఇంట్లో నుంచి ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లి 20 గంటలు ప్రశ్నించారు. ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. 
 
అధికారుల విచారణలో రానా కపూర్ సరిగా సమాధానాలు చెప్పట్లేదని సమాచారం. కోర్టు ద్వారా కస్టడీకి తీసుకొని ప్రశ్నించడం ద్వారా నిజాలు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ సహా మరో కార్పొరేట్ కంపెనీకి ఇచ్చిన అప్పుల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. యెస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన కొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర వున్నట్లు తెలుస్తోంది. 
 
తాజాగా యెస్‌ బ్యాంక్ డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. యస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ... విత్‌డ్రాలపై రూ.50వేల పరిమితిని విధించడంతో సమస్యలొచ్చాయి. కానీ ప్రస్తుతం యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఏటీఎంల నుంచి డబ్బు రావడంతో కస్టమర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.