శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:34 IST)

ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ ఆటో రిక్షా ఈ- స్మార్ట్‌ కోసం ఎరీషా ఈ మొబిలిటీ ప్రీ లాంచ్‌ బుకింగ్స్‌ ప్రారంభం

E-auto
పూర్తి విద్యుత్‌ వాహనాలను ఎగుమతి చేయడంతో పాటుగా హైడ్రోజన్‌ ఇంధన బస్సుల తయారీ, పంపిణీ, ఎగుమతి రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రానా గ్రూప్‌ సంస్ధ ఎరీషా ఈ మొబిలిటీ ఈ పండుగ సీజన్‌లో విద్యుత్‌ వాహన మార్కెట్‌లో సంచనాలను సృష్టించడానికి సిద్ధమైంది. తమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్గో ఈ-సుపీరియర్‌, ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వాహన మూడు చక్రాల ఆటో రిక్షా ఈ-స్మార్ట్‌ను ఎల్‌5 విభాగంలో అక్టోబర్‌ 02, 2022 నుంచి ముందస్తు బుకింగ్స్‌ కోసం అనుమతించినట్లు వెల్లడించింది.
 
ఈ-ఆటోల ప్రీ-లాంచ్‌ బుకింగ్‌ గురించి రానా గ్రూప్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దర్శన్‌ రానా మాట్లాడుతూ, ‘‘ఎరీషా ఈ మొబిలిటీ ప్రధానంగా పర్యావరణ అనుకూల, అందుబాటు ధరలోని రవాణా అవకాశాలను భారతదేశ వాసులకు అందించాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ-ఆటోను భారతదేశంలో నేపథ్యీకరించడంతో పాటుగా భారత మార్కెట్‌ కోసం తీర్చిదిద్దాము. ఈ ఈ-ఆటో ఒక్కసారి చార్జ్‌ చేస్తే 120-142 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. భారతదేశంలో తుది మైలు కనెక్టివిటీ అవసరాలు తీర్చడంతో పాటుగా దేశంలో విద్యుత్‌ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా చేసుకుంది. మా ఎలక్ట్రిక్‌ కార్గో ఈ- సుపీరియర్‌, ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ మూడుచక్రాల ఆటో రిక్షా ఈ-స్మార్ట్‌తో ప్రభుత్వ కర్బన ఉద్గార లక్ష్యాలకు మద్దతునందిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ-సుపీరియర్‌, ఈ-స్మార్ట్‌ వాహనాలలో 51 వోల్టుల లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 120-142 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కసారి చార్జింగ్‌‌తో అధిగమించేందుకు తోడ్పడుతుంది. ఏదైనా స్టాండర్డ్‌ చార్జర్‌తో 4-5 గంటలతో ఈ బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఈ రెండు వాహనాలూ తెలుపు రంగులో రెడ్‌ కలర్‌ డోర్స్‌తో వస్తాయి. వీటిపై 39 నెలల స్టాండర్డ్‌ వారెంటీ ఉంది. ఈ-ఆటో డెలివరీలు నవంబర్‌ 2022 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన వినియోగదారులు 2100 రూపాయలను కంపెనీ వెబ్‌సైట్‌‌ ద్వారా చెల్లించి లేదా భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌ నెట్‌వర్క్‌ వద్ద చెల్లించవచ్చు.