గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:53 IST)

చిన్న వ్యాపార ప్రకటనదారులకు ఋణాలు పొందడంలో సహాయపడి వారు వృద్ధి సాధించడంలో తోడ్పడుతున్న ఫేస్‌బుక్‌

ఫేస్‌బుక్‌ ఇండియా నేడు నూతన కార్యక్రమం, ‘స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ ఇనీషియేటివ్‌’ను వెల్లడించింది. దీనిద్వారా ఫేస్‌బుక్‌పై ప్రకటనలు అందించే చిరు మరియు మధ్యతరహా వ్యాపారాలు (ఎస్‌ఎంబీలు)కు వేగవంతంగా ఋణాలను స్వతంత్య్ర ఋణ ప్రదాతల మద్దతు ద్వారా అందించనుంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ తొలుత భాగస్వామ్యం చేసుకున్న ఋణ ప్రదాతగా ఇండిఫీ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని మరింత మంది భాగస్వాములను బోర్డుపైకి చేర్చే రీతిలో నిర్మించారు. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం, వ్యాపార ఋణాలు అత్యంత సులభంగా చిరు వ్యాపారులకు లభించేలా చేయడం. తద్వారా భారతీయ ఎంఎస్‌ఎంఈ రంగానికి ఋణ అంతరాలను తగ్గించడం.
 
ఫేస్‌బుక్‌ ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన మొట్టమొదటి దేశం ఇండియా. ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా 200 నగరాలు మరియు పట్టణాలలో నమోదిత వ్యాపార సంస్థలకు అందుబాటులో ఉంచారు. ఫేస్‌బుక్‌ ఇండియా వీపీ– ఎండీ  అజిత్‌ మోహన్‌ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ‘‘భారతదేశపు చిరు వ్యాపారులకు ఆర్థికావకాశాలను సృష్టించడానికి ఫేస్‌బుక్‌ పూర్తిగా కట్టుబడి ఉంది. సమయానికి తగిన నిధులను పొందడం అనేది అత్యంత కీలకం.
 
తద్వారా వారు వేగంగా తమ వ్యాపారులను పునరుద్ధరించుకోవడంతో పాటుగా భారీ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడమూ వీలవుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా అసాధారణ వృద్ధిని దేశం నమోదు చేస్తూ ఋణ ప్రాప్యతను సైతం విస్తరిస్తుంది. ఓ కంపెనీగా, డిజిటల్‌ పరివర్తనను మేము వేగవంతం చేస్తున్నాము మరియు చిరు వ్యాపార ఋణాల కార్యక్రమం ఇప్పుడు తొలిదశ వ్యవస్థాపకులకు తమ ఆలోచనలు మరియు రిస్క్‌ తీసుకోవాలనుకునే తమ కోరికకు అతి పెద్ద ప్రేరణగా నిలువనుంది’’ అని అన్నారు
 
ఈ ప్రకటనను ‘ఆర్థిక చేర్పు ద్వారా  ఎంఎస్‌ఎంఈ వృద్ధిని సాధ్యం చేయడం’ శీర్షికన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) భాగస్వామ్యంతో ఫేస్‌బుక్‌ నిర్వహించిన ఓ వర్ట్యువల్‌ కార్యక్రమంలో చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ యొక్క చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అమితాబ్‌ కాంత్‌ కీలకోపన్యాసం చేశారు.
 
ఉదయ్‌ శంకర్‌, అధ్యక్షులు, ఫిక్కీ మాట్లాడుతూ, ‘‘సరైన అవకాశాలు, నైపుణ్యాలు మరియు పరిష్కారాల ద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని శక్తివంతం చేయాలనే ఫేస్‌బుక్ ప్రయత్నాలను ఫిక్కీ ప్రశంసిస్తుంది. భారతదేశపు ఎంఎస్‌ఎంఈ రంగ వృద్ధి కోసం ప్రైవేట్‌ రంగం కూడా చేయూతనందించాల్సిందిగా ఫిక్కీ ఎప్పుడూ నమ్ముతుంటుంది. ఇప్పుడు ఫేస్‌బుక్‌ యొక్క చిరు వ్యాపార ఋణాల కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. దీనిద్వారా పరిశ్రమకు మరింత సులభంగా ఋణాలు లభిస్తాయి. రాబోయే నెలల్లో ఫేస్‌బుక్‌తో  భాగస్వామ్యం చేసుకుని ఎంఎస్‌ఎంఈ రంగానికి తగిన ప్రేరణ అందించేలా పలు కార్యక్రమాలను, పరిష్కారాలను అందించనున్నాం’’ అని అన్నారు.
 
ఓఈసీడీ మరియు ప్రపంచ బ్యాంక్‌తో కలిసి గత సంవత్సరం ఫేస్‌బుక్‌ నిర్వహించిన ‘వ్యాపార భవిష్యత్‌’ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, 2020లో ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌ఎంబీలలో మూడవ వంతు మంది చెప్పేదాని ప్రకారం నగదు ప్రవాహం అనేది తాము ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రాధమిక సవాల్‌గా నిలుస్తుంది. సమయానికి తగిన ఋణాలను పొందడమన్నది అతి పెద్ద సవాలుగా నిలుస్తుంది. మరీముఖ్యంగా సూక్ష్మ, చిరు వ్యాపార సంస్థలతో పాటుగా నూతనంగా తమ వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించిన లేదా పెద్దగా ఋణ చరిత్ర లేని వారికి ఈ ఋణ ప్రాప్యత కష్టంగా ఉంది.
 
అధిక మరియు ఫ్లోటింగ్‌ వడ్డీరేట్లు వంటివి ఎక్కువ శాతం చిరు వ్యాపారులు ఋణాల కోసం దరఖాస్తు చేయడానికి ఇబ్బందిపడేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఇండిఫీ తో ఫేస్‌బుక్‌  భాగస్వామ్యంతో చిరు వ్యాపార సంస్థలు , మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్‌పై ప్రకటనలు ఇస్తున్న సంస్థలు వార్షికంగా ముందుగానే నిర్ధేశించిన రీతిలో 17%-20% వడ్డీరేటుతో ఋణాలను పొందగలరు.  ఈ కార్యక్రమం ద్వారా చిరు వ్యాపార సంస్థలు ఎలాంటి తనఖాలనూ పెట్టవలసిన అవసరం లేకుండానే క్విక్‌ లోన్‌ అప్లికేషన్‌ ద్వారా ఋణాలను పొందగలరు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్న చిరు వ్యాపారాలకు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజులనూ ఇండిఫీ వసూలు చేయదు.
 
అంతేకాదు, ఇండిఫీ ఈ ఋణాలను  ఋణ గ్రహీత అన్ని డాక్యుమెంటేషన్‌ లాంఛనాలను పూర్తి చేసి, ఇండిఫీ అంగీకరించిన తరువాత ఐదు పనిదినాలలో పంపిణీ చేయడం చేస్తుంది. ఎన్నో చిరు వ్యాపార సంస్థలు అతి తక్కువ టిక్కెట్‌ సైజ్‌ కలిగిన  ఋణాలను పొందడంలో తీవ్రంగా సమస్యలను ఎదుర్కొవడంతో పాటుగా ఎంతోమంది ఋణదాతలకు అనుకూలమూ కాదు. ఈ కార్యక్రమం ద్వారా, చిరు వ్యాపార సంస్థలు 5 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకూ ఋణాలను పొందవచ్చు.
 
భారతదేశంలో మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు సైతం తోడ్పాటునందించడం ద్వారా  వారు ఎదిగేందుకు సహాయపడటానికి ఫేస్‌బుక్‌ కట్టుబడి ఉంది. చిరు వ్యాపార సంస్థలు, మరీ ముఖ్యంగా మహిళలు పూర్తిగా లేదా పాక్షికంగా సొంతం చేసుకున్నటువంటి సంస్థలు 0.2 % రాయితీని  దరఖాస్తు చేసిన ఋణాలపై ఇండిఫీ వర్తింపజేసే వార్షిక వడ్డీరేటుపై పొందవచ్చు.
 
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం, దేశంలోచిరు వ్యాపారాలు ఎదిగేందుకు శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే ప్రయత్నంలో ఫేస్‌బుక్‌ వేసిన మరో అతిపెద్ద ముందడుగు. ఈ కార్యక్రమం పూర్తిగా లాభాపేక్ష లేని ఒప్పందంగా ఉంది. ఫేస్‌బుక్‌ ఋణ భాగస్వామ్యులు మరియు  చిరు వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఫేస్‌బుక్‌ ప్రకటనలపై తమ ఋణ మొత్తాలను ఖర్చు చేయాలనే నిబంధనలేవీ లేవు.
 
గత సంవత్సర కాలంలో, చిరు వ్యాపార సంస్థలు ఆర్థికంగా కోలుకునేందుకు పలు చర్యలను ఫేస్‌బుక్‌ తీసుకుంది. ఈ  కార్యక్రమాలలో చిరు వ్యాపార సంస్ధలకు గ్రాంట్లను మంజూరు చేయడం మరియు చిరు వ్యాపార సంస్థల ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌ ప్రయాణాలకు మద్దతునందిస్తూ పరిశ్రమలో అగ్రగామి నైపుణ్య కార్యక్రమాలను  విస్తరించడం వంటివి ఉన్నాయి. ఈ చిరు వ్యాపారుల ఋణ కార్యక్రమంతో, ఫేస్‌బుక్‌ మరింతగా భారతదేశంలో సూక్ష్మ, చిరు, మధ్యతరహా వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడనుంది.