గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (10:06 IST)

3 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన.. ఎక్కడ?

Ford
దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కోవలో అనే టెక్ కంపెనీలతో పాటు ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇపుడు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కంపెనీ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. అమెరికా, కెనడా దేశాల్లో పని చేసే ఉద్యోగుల్లో 3 వేల మందిని తొలగించేందుకు సిద్ధంకాగా, వీరిలో 2 వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు, మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. 
 
కంపెనీలోని అన్ని స్థాయిల ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తుంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ వాహనాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ (విక్రయాలు) లేకపోవడం, మరోవైపు, కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ఉద్యోగులను తొలగించి భారాన్ని తగ్గించుకునేలా ప్రణాళికలు రచించింది.