ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 జులై 2021 (16:14 IST)

డారెన్‌ సామిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించిన Fun 88

ప్రముఖ స్పోర్ట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫన్‌88, తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా డారెన్‌ సామి ఉంటారని నేడు ప్రకటించింది. వెస్టిండీస్‌ టీ20 వల్డ్‌ కప్‌ విజేతగా రెండుసార్లు నిలవడంలో కెప్టెన్‌గా వ్యవహరించిన సామికి ఇండియా, ఉపఖండంలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం హైదరాబాద్‌కు కూడా సామి ఆడారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్‌ ఫన్‌88. క్రికెట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన రియల్‌ టైమ్‌ న్యూస్‌, విశ్లేషణలను అందిస్తుంది.
 
భారతీయ క్రీడాభిమానులతో రూపొందించే బ్రాండ్‌ ఫిల్మ్స్‌ సిరీస్‌లో పాల్గొంటూ ఈ భాగస్వామ్యానికి సామి శ్రీకారం చుట్టనున్నారు. ఫన్‌88 చేపట్టిన సమగ్ర బ్రాండింగ్, మార్కెటింగ్‌ ప్రచారం #LagiShart లో భాగంగా ఈ బ్రాండింగ్‌ ఫిల్మ్స్‌ ఉండనున్నాయి.
 
ఈ అనుబంధం, డారెన్‌ సామిని ఈ వేదిక ప్రచారక్తరగా చేర్చుకోవడంపై, ఫన్‌88 అధికారి ప్రతినిధి మాట్లాడుతూ “డారెన్‌ నాయకుడు, అందరికీ ప్రేరణ. కరేబియన్‌ క్రికెట్‌లో ఆయన సాధించిన విజయాలు, ఆయన అందించిన సహకారం చాలా గొప్పది. ఇండియాలోనూ డారెన్‌కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. భారతదేశంలో స్పోర్ట్స్‌ కంటెంట్‌కు పర్యాయపదంగా ఫన్‌88ను నిలపాలన్న మా లక్ష్యాన్ని ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ఈ అనుబంధం మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది, డారెన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను ఆధారం చేసుకొని ఫన్‌88ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని మేము ఆశిస్తున్నాం” అన్నారు.
 
“88 సంఖ్యతో నాకు ఎంతో అనుబంధం ఉంది, అది నా జెర్సీ నెంబర్‌గా రెండు దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు ఫన్‌88 ద్వారా భారత క్రీడాభిమానులకు చేరువకాబోతున్నాను. కొన్నాళ్లుగా ఫన్‌88ని నేను ఫాలో అవుతున్నాను, ఆ వేదిక ఎలా ఎదిగిందో నేను గమనించాను. ఆరంభం నుంచే అది స్పోర్ట్స్‌, క్రికెట్‌ను వేడుకగా చేస్తూ అభిమానులందరినీ ఒక్క చోటుకు చేర్చింది.  ఫన్‌88 టీమ్‌తో అనుబంధం నాకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తోంది. ఆ వేదికకు ప్రచారకర్తగా నాకు అవకాశం కల్పించినందుకు నేనెంతో కృతజ్ఞుడినై ఉంటాను” అన్నారు ఫన్‌88 బ్రాండ్‌ అంబాసిడర్‌గా సంతకం చేస్తూ డారెన్‌ సామి.