బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 నవంబరు 2020 (17:25 IST)

కన్‌స్ట్రక్షన్‌ స్టార్టప్‌ హోకోమోకో బ్రాండ్‌ అంబాసిడర్‌గా తరుణ్‌ భాస్కర్‌

గృహ నిర్మాణ మరియు మానిటరింగ్‌ కంపెనీ హోకోమోకో ఇప్పుడు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలుగు చిత్ర నటుడు, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యంను ఎంచుకుంది. ఈ జాతీయ అవార్డు విజేత, అత్యంత ప్రశంసనీయమైన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘పెళ్లిచూపులు’ దర్శకునిగా  ప్రసిద్ధి. పెళ్లిచూపులు ఆయనకు తొలి పూర్తిస్థాయి చిత్రం.
 
శ్రీపాద్‌ నందిరాజ్‌, ఫౌండర్‌ అండ్‌ సీఈవో-హోకోమోకో మాట్లాడుతూ,‘‘ఒకే తరహా ఆసక్తులు మనుషులను ఏకం చేస్తాయని నానుడి. అదే రీతిలో అభివృద్ధిప్రణాళికలు, అందరికీ చేరుకోవాలనే లక్ష్యం వంటివి శ్రీ తరుణ్‌ భాస్కర్‌ మరియు మమ్మల్ని కలిపాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, మేము పరిమిత వనరులతోనే తమ కలల ఇంటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ సహాయపడటంతో పాటుగా ఈ ప్రక్రియలో అడ్డంకులను సైతం అధిగమించడానికి తోడ్పడాలనుకుంటున్నాం. హోకోమోకో బ్రాండ్‌ అంబాసిడర్‌గా శ్రీ తరుణ్‌ భాస్కర్‌ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి తరుణ్‌ భాస్కర్‌ దాస్యం మాట్లాడుతూ, ‘‘చాలామందికి సొంత ఇంటిని నిర్మించుకోవడమన్నది ఎప్పుడూ జీవిత లక్ష్యంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా నాకది జీవిత లక్ష్యం. మా నాన్న ఈ కలను సాకారం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. దురదృష్టవశాత్తు, అది జరుగలేదు. నాకు అర్థమయ్యింది ఏమిటంటే దానికి పూర్తి ప్రణాళిక ఉండాలి. ఎక్కడ ప్రారంభించాలి, ఎవరిని కలవాలి అని విచారణ చేయడం ప్రారంభించినప్పుడు ఇది చాలా కష్టతరమైన అంశమని నాకు తోచింది. ఓ ఇంటిని డిజైన్‌ చేయడంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల జాబితా అపరిమితం. నాకు తెలిసి చాలామందికి ‘నేను నా ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలి’ అన్నది అతి పెద్ద సమస్యగానే నిలుస్తుంది’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘దీనికి హోకోమోకో అతి సులభమైన పరిష్కారం చూపుతుంది. గందరగోళాన్ని తగ్గించే రీతిలో ఈ బృందం ఓ ప్రత్యేక విధానం అనుసరించడంతో పాటుగా క్లయింట్‌ కోసం దీన్ని చాలా సరళం చేస్తుంది. ఇదెంత సులభమంటే ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం లేదంటే షాపింగ్‌ చేసినంతగా! ప్రణాళిక దగ్గరకు వచ్చేసరికి ఈ సంస్థ వ్యవస్థాపకులతో పాటుగా బృందం కూడా అద్భుతం. వీరి అంకితభావం, ఈ వ్యాపారం పట్ల వారి అభిరుచి నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఈ వెంచర్‌లో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
 
గృహ మరియు వాణిజ్య ప్రాజెక్టులకు నిర్మాణ సేవలను ఈ కన్‌స్ట్రక్షన్‌ టెక్‌ స్టార్టప్‌ అందిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ తీరుతెన్నులను పూర్తిగా మార్చడానికి కంపెనీ లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల నిర్మాణ అవసరాలకూ ఏకీకృత పరిష్కారంగా నిలువాలనుకుంటుంది. ఈ స్టార్టప్‌లో ఈ-మానిటరింగ్‌ సేవలు సైతం ఉన్నాయి. దీనిద్వారా వర్ట్యువల్‌గా సైట్‌ వద్ద నిర్మాణ పని తీరును వినియోగదారులు పర్యవేక్షించవచ్చు. ఇతర సేవలలో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్కిటెక్చర్‌ మరియు స్ట్రక్చర్‌ మరియు ఇంటీరియర్స్‌ అండ్‌ స్మార్ట్‌ హోమ్‌ ఉన్నాయి.