శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:59 IST)

అమీర్‌ఖాన్‌ను తమ ప్రచారకర్తగా ఎంపిక చేసుకున్న సియట్‌

భారతదేశంలో సుప్రస్ధి టైర్‌ తయారీదారు సియట్‌ టైర్స్‌, రెండేళ్ల కాలానికి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ను తమ ప్రచారకర్తగా ఎంచుకుంది. సమగ్రమైన మార్కెటింగ్‌ ప్రచారంలో భాగంగా, అమీర్‌ఖాన్‌ రెండు వాణిజ్య ప్రకటనలలో కనిపించనున్నారు. ఈ రెండింటినీ ఐపీఎల్‌2020 నడుమ సియట్‌ యొక్క సెక్యూరా డ్రైవ్‌ శ్రేణి ప్రీమియం కార్ల టైర్లను ప్రచారం చేయడానికి ప్రసారం చేస్తారు.
 
ఈ వరుసలో మొదటి ప్రకటనను ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ప్రసారం చేయనున్నారు. ఈ ప్రకటనను విభిన్నమైన మీడియా వేదికలలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ ప్రచారాన్ని ‘డమ్మీ అవ్వకండి’ అనే నేపథ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా ఎలాంటి డ్రైవింగ్‌ పరిస్థితులలో అయినా  పూర్తి రక్షణ అందించే అత్యన్నత నాణ్యత కలిగిన టైర్ల వినియోగించడాన్ని ప్రోత్సహిస్తుంది.
 
ఓ అండ్‌ ఎం సృష్టించిన ఈ ప్రచారం, ఆసక్తికరమైన కథనం ఆధారంగా రూపొందించబడింది. దీనిని అత్యాధునిక టైర్‌ పరీక్షా సదుపాయం వద్ద రూపొందించారు. దీనిలో పరీక్ష కోసం పరీక్షా డమ్మీలను వినియోగించారు. అమీర్‌ఖాన్‌ యొక్క క్యారెక్టర్‌ డమ్మీగా ఉండటంతో పాటుగా ఎవరూ తనను చూడటం లేదని భావించడంతో పాటుగా టైర్‌ పరీక్షా ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి పరిస్థితులను తారుమారు చేయాలని ప్రయత్నిస్తారు.
 
ఈ ప్రకటన వెనుకనున్న ఆలోచన భద్రతను ప్రోత్సహించడం మరియు విభిన్న డ్రైవింగ్‌ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రయాణానికి సియట్‌ సెక్యుర డ్రైవ్‌ కారు టైర్లు ఏ విధంగా తోడ్పడుతుందనేది ప్రచారం చేయడం. ఈ టైర్లు అత్యున్నత నియంత్రణను  అత్యధికవేగంతో కూడిన మలుపులు మరియు ఖచ్చితమైన బ్రేకింగ్‌ వద్ద అందిస్తుంది. సియట్‌ యొక్క సెక్యుర డ్రైవ్‌ టైర్లును ప్రీమియం సెడాన్లు మరియు కంపాక్ట్‌ ఎస్‌యువీలు అయినటువంటి హోండా సిటీ, స్కోడా ఆక్టావియా, టయోటా కొరొల్లా, హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ సుజుకీ విటారా బ్రెజ్జా, హోండా డబ్ల్యుఆర్‌–వీ మొదలైన వాటికి అనువుగా ఉంటాయి.
 
శ్రీ అమిత్‌ తొలానీ, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, సియట్‌ టైర్స్‌ లిమిటెడ్‌ ‘‘సియట్‌ వద్ద మేమెప్పుడూ కూడా ప్రతి రోజూ ప్రయాణాలను  సురక్షితంగా మరియు స్మార్టర్‌గా మలువడాన్ని విశ్వసిస్తుంటాము. మా నూతన ప్రచారపు ఆవిష్కరణ దీనినే మా ప్రీమియం సెడాన్స్‌, కంపాక్ట్‌ ఎస్‌యువీ టైర్ల శ్రేణిలో ప్రదర్శిస్తుంది. ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, విశ్వసనీయ, ఆధారపడతగిన మరియు మన్నికైన టైర్లను డమ్మీ టైర్లకు బదులుగా వాడటం ప్రోత్సహించడం.
 
ఈ ప్రచారం కోసం అమీర్‌ఖాన్‌ను మా బోర్డ్‌పైకి తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సియట్‌ యొక్క అత్యంత కీలకమైన విలువలైనటువంటి సమగ్రత, అభిరుచి, ఖచ్చితత్త్వం, ఆవిష్కరణలను ఆయన ఖచ్చితంగా ప్రదర్శిస్తారు. పరిశ్రమలో అత్యుత్తమ నటులలో ఒకరిగా, తమ విభాగంలో అత్యుత్తమ టైర్లలో ఒకటిగా నిలిచిన సియట్‌తో భాగస్వామ్యం చేసుకోవడమనేది విజేతగా నిలిచే సమ్మేళనంగా భావిస్తున్నాం. ఐపీఎల్‌ మాకు అత్యుత్తమ అవకాశాన్ని మా వినియోగదారులతో కనెక్ట్‌ అయ్యేందుకు అందిస్తుంది. అసాధారణ వీక్షకులు కలిగిన అతి ముఖ్యమైన కార్యక్రమాలలో  ఇది ఒకటి’’ అని అన్నారు.
 
బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అత్యంత గౌరవనీయ బ్రాండ్లలో ఒకటైన సియట్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ఈ ప్రచారం కోసం సియట్‌ నన్ను సంప్రదించినప్పుడు, నేను తక్షణమే ఈ ఆలోచనతో కనెక్ట్‌ అయ్యాను, ఈ స్ర్కిప్ట్‌తో ప్రేమలో పడిపోయాను. డమ్మీ క్యారెక్టర్‌ చేయడం ఓ వినూత్న అనుభూతి కలిగించింది. ఈ షూట్‌ను నేను బాగా ఆస్వాదించాను. సియట్‌ టైర్లతో ఉత్సాహపూరిత ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.
 
శ్రీ రోహిత్‌ దుబే, గ్రూప్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌, ఓ అండ్‌ ఎం మాట్లాడుతూ ‘‘సాధారణ రోజులలో సియట్‌  టైర్ల ప్రకటనలు అత్యున్నతంగా ఉంటుంటాయి. అలాంటిది, భారతదేశంలో అత్యున్నత క్రీడావినోదం ఐపీఎల్‌ సమయంలో ఈ బ్రాండ్‌ తమంతట తాముగా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంటుంది. సియట్‌ యొక్క ట్రేడ్‌మార్క్‌ టంగ్‌–ఇన్‌–చీక్‌ విధానంతో వైవిధ్యతను తీసుకురావాలనే ప్రయత్నం, మమ్మల్ని అమీర్‌ఖాన్‌తో భాగస్వామ్యం చేసుకునేలా చేసింది.
 
అయితే, ఆయనతో మేము ఏ కొత్తదనం సృష్టించగలమన్నదే సవాల్‌గా నిలిచింది. అప్పుడే పారానాయిడ్‌ క్రాష్‌ టెస్ట్‌ డమ్మీ ఆలోచన వచ్చింది. కోవిడ్‌ ఉత్పత్తి వాస్తవికత పట్ల అవగాహనతో, మేము ప్రజా సమూహాల అవసరం లేకుండా అతి తక్కువ మందితో పూర్తయ్యేలా రూపొందించాం. ‘బాత్‌ సేఫ్టీ కీ హై, డోంట్‌ బీ ఏ డమ్మీ’ (భద్రత గురించి మాట్లాడుతున్నాం, డమ్మీ కావొద్దు) అనేలా రూపుదిద్దుకున్న ఈ ప్రచారం వినియోగదారుల నడుమ అవగాహన కల్పించడంతో పాటుగా ఐపీఎల్‌ క్రీడాభిమానుల నడుమ వినూత్నంగా నిలువనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
వెడల్పైన లాంగిట్యూడినల్‌ ట్రెడ్‌ గ్రూవ్స్‌ మరియు స్మార్ట్‌ కాంపౌండింగ్‌ సాంకేతికతతో కూడిన సియట్‌ సెక్యూర డ్రైవింగ్‌ టైర్లు వాహనాన్ని డ్రైవర్‌ నియంత్రణలో తడి మరియు పొడి రోడ్ల పరిస్థితులలో ఉంచుతాయి. మెరుగైన టైర్‌ట్రెడ్‌ టెక్నాలజీ శబ్ద స్థాయిలను తగ్గించడంలో తోడ్పడటంతో పాటుగా అసాధారణ డ్రైవింగ్‌ అనుభవాలను అందిస్తాయి.