కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరలు రూ.200లకు తగ్గింపు
ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతులు విధించింది.
ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు (12 సిలిండర్ల వరకు) రూ.200 సబ్సిడీని అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది దేశంలోనే ఎందరో మహిళలకు సాయం చేస్తుందని ఆమె అన్నారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.