శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 డిశెంబరు 2020 (21:52 IST)

భారతదేశపు వ్యర్థ నిర్వహణకు రీసైకల్ డిజిటల్ సొల్యూషన్స్ మూలధనం జోడింపు

సింగపూర్‌ కేంద్రంగా కలిగిన పెట్టుబడుల నిర్వహణ కంపెనీ, సర్క్యులేట్‌ క్యాపిటల్‌ ప్రధానంగా సముద్రాలలో చేరే ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నివారించడంతో పాటుగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ(సర్క్యులర్‌ ఎకనమీ)ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంది. ఈ కంపెనీ ఏర్పాటుచేసిన సర్క్యులేట్‌ క్యాపిటల్‌ ఓషన్‌ ఫండ్‌ (సీసీఓఎఫ్‌) ఇప్పుడు హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ర్యాపిడ్యు టెక్నాలజీస్‌ (రీసైకల్‌)లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్‌ పరిష్కారాల వేస్ట్‌-కామర్స్‌ (డబ్ల్యు-కామర్స్‌) కంపెనీ రీసైకల్‌.
 
ఇది విలువ చైన్‌ వ్యాప్తంగా వాటాదారులందరినీ అనుసంధానించడంతో పాటుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను సైతం తీరుస్తోంది. పెప్సికో (దీని మొదటి ఇన్వెస్టర్‌), ప్రోక్టర్‌ అండ్‌ గాంబెల్‌, డౌ, డానోన్‌, చానెల్‌, యునిలీవర్‌, ద కోకా కోలా కంపెనీ మరియు చెవ్రాన్‌ ఫిలిప్స్‌ కెమికల్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన  సీసీఓఎఫ్‌, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలలోని సముద్రాలలో ప్లాసిక్‌ వ్యర్ధాలపై పోరాటం సాగించేందుకు ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌.
 
డిజిటల్‌ వ్యాపారాలను అభివృద్ధి చేసిన అపారమైన వ్యాపార అనుభవంతో, భారతదేశంలో వ్యర్ధ నిర్వహణ మరియు రీసైక్లింగ్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను రీసైకల్‌ గుర్తించడంతో పాటుగా డిజిటల్‌ సాంకేతికత ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ఈ సవాళ్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాల కొనుగోలుదారులు మరియు విక్రేతల నడుమ అసమతుల్యత, అలాగే పారదర్శకత లోపించడం, మూలల వద్ద వేరు చేయడం, పదార్ధాలను గుర్తించడం మరియు క్రియాత్మక విశ్లేషణలు వంటివి ఉన్నాయి.
 
రీసైకల్‌ యొక్క వినూత్నమైన, సమగ్రమైన విధానం వ్యర్ధాల సృష్టికర్తలతో పాటుగా వ్యర్ధాల ప్రాసెసర్లు, రీసైకిలర్లు మరియు బ్రాండ్‌ యజమానులను క్లౌడ్‌ ఆధారిత పరిష్కారాల ద్వారా కలుపుతుంది. ఇది పారదర్శక, గుర్తించతగిన మెటీరియల్‌ ప్రవాహం మరియు లావాదేవీలకు తోడ్పడుతుంది. ఈ కంపెనీ మరింత ప్రభావవంతమైన, సమర్థవంతమైన డ్రై వ్యర్ధాల నిర్వహణను తమ డిజిటల్‌ మార్కెట్‌ప్లేస్‌ ద్వారా వ్యర్ధాలు, స్మార్ట్‌ సెంటర్‌ పరిష్కారాలు మరియు ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సబిలిటీ (ఈపీఆర్‌) మేనేజ్‌మెంట్‌ టూల్‌ అయిన ఈపీఆర్‌ పరిష్కారాల కోసం అందిస్తుంది. రిసైకల్‌ యొక్క వ్యర్థాల సేకరణ కోసం డి జిటల్‌ ఫుట్‌ప్రింట్‌ మరియు ఛానలైజేషన్‌లో నాలుగు లక్షల మందికి పైగా వినియోగదారులు మరియు 1000 కు పైగా వ్యాపారాలు, 500 యాగ్రిగేటర్లు మరియు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, 100కు పైగా రీసైకిలర్లు, 30 మున్సిపాలిటీలు భారతదేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నారు.
 
ఈ సందర్భంగా అభయ్‌ దేశ్‌పాండే, ఫౌండర్‌, రీసైకల్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో మొట్టమొదటి డబ్ల్యు–కామర్స్‌ కంపెనీగా నిలువడం పట్ల గర్వంగా ఉన్నాము. వ్యర్ధ నిర్వహణ మరియు రీసైక్లింగ్‌ పరిశ్రమను సమూలంగా మార్చడంతో పాటుగా డిజిటల్‌ పరిష్కారాల ద్వారా నూతన ప్రమాణాలను ఏర్పరుస్తున్నాం. కీలకమైన సంస్థలతో పాటుగా విలువ గొలుసులో అసాధారణ విలువను లావాదేవీలు తీసుకురావడంతో పాటుగా మెటీరియల్‌ ప్రవాహాన్ని గుర్తించడం మరియు కనిపెట్టడంలో సంపూర్ణమైన పర్యావరణ వ్యవస్ధను అందించడం ద్వారా పరిశ్రమకు వినూత్నమైన ప్రతిపాదన అందించగలమని నమ్ముతున్నాము. వాటాదారులందరినీ అనుసంధానించడం ద్వారా, రీసైక్లింగ్‌లో  వినూత్నతను ప్రోత్సహించడానికి మేము సామర్థ్యం పెంచుతున్నాము. ఈ పెట్టుబడి, మా ఆఫరింగ్స్‌ను భారతదేశంలో మరిన్ని మార్కెట్‌లకు తీసుకువచ్చేందుకు తోడ్పటంతో పాటుగా దేశపు వ్యర్థ నిర్వహణ మరియు రీసైక్లింగ్‌ పరిశ్రమలో డిజిటల్‌ విప్లవం తీసుకురావడంలో  మాకు వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ వాగ్ధానం గురించి రాబ్‌ కప్లాన్‌, సీఈవో, సర్క్యులేట్‌ క్యాపిటల్‌ మాట్లాడుతూ ‘‘డిజిటల్‌ వ్యర్ధాల  మార్కెట్‌ ప్రాంగణంతో పాటుగా సమగ్రమైన డిజిటల్‌ పరిష్కారాలను మొత్తం వ్యర్ధాల నిర్వహణ, రీసైక్లింగ్‌ పరిశ్రమకు అందించిన మొట్టమొదటి కంపెనీగా రీసైకల్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. పారదర్శకత మరియు ట్రేసబిలిటీ వంటి క్లిష్టమైన సమస్యలను భారతదేశపు సర్క్యులర్‌ ఆర్ధిక వ్యవస్ధలో  పరివర్తక మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. రీసైకల్‌తో ఈ ప్రయాణం పట్ల మేము ఉత్సాహంగా ఉన్నాము మరియు ఈ ఉత్సాహపూరితమైన విస్తరణ దశలో సంస్థకు మద్దతు అందించడానికి ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
 
ఇప్పటి వరకూ 39 మిలియన్‌ యూఎస్‌ డాలర్లను సర్క్యులేట్‌ క్యాపిటల్‌ అందించేందుకు వాగ్ధానం చేసింది. ప్లాస్టిక్‌ కాలుష్యంపై పోరాడేందుకు మరియు భారతదేశంలో సర్క్యులర్‌ ఎనకమీని మెరుగుపరిచేందుకు అంకితం చేసిన అతి పెద్ద  పెట్టుబడిగా ఇది నిలుస్తుంది. ఈ పోర్ట్‌ఫోలియోలో ఆరు స్థానిక చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్‌ఎంఈలు) భాగంగా ఉంటాయి. ఇవి వ్యర్ధ నిర్వహణ రంగంలో అగ్రగాములుగా ఉన్నాయి మరియు రీసైక్లింగ్‌ విలువ చైన్‌లో వైవిధ్యతను తీసుకువచ్చాయి.
 
ఈ క్రమంలో, ఈ పోర్ట్‌ఫోలియో భారతదేశంలో పరిశ్రమను భౌతికంగా వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకుని కీలకమైన వ్యవస్ధీకృత ఖాళీలు, పర్యావరణ వ్యవస్ధలో ఇబ్బందికరమైన అంశాలు అయినటువంటి విఛ్చిన్నం, కనిపెట్టగల లోపాలను గుర్తించలేకపోవడం, రీసైకిల్డ్‌ పదార్ధాల యొక్క తక్కువ నాణ్యతను మూడు కీలకమైన ఆవిష్కరణ వ్యూహాలు ః వ్యర్ధాలను విలువగా మార్చేందుకు అప్‌సైక్లింగ్‌ను వ్యాప్తి చేయడం (లుక్రో ప్లాస్ట్‌సైకిల్‌, శ్రీచక్ర, రిక్రాన్‌ మరియు దాల్మియా పాలీప్రో) ; డిజిటైజేషన్‌ వ్యాప్తి (రీసైకిల్‌); మరియు సేకరణ, ఎంపికను వ్యాప్తి చేయడం (నెప్రా రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) ద్వారా పూరించే ప్రయత్నం చేస్తుంది.
 
సీసీఓఎఫ్‌ యొక్క పెట్టుబడుల ద్వారా అందించే ఉత్ర్పేరక మూలధనం, సామర్థ్య విస్తరణకు నిధులు సమకూర్చడంతో పాటుగా పోర్ట్‌ఫోలియో కంపెనీలు తరువాత దశ వృద్ధి దిశగా పయణించేందుకు తోడ్పడుతుంది. ఫైనాన్సింగ్‌తో పాటుగా మెంటార్‌షిప్‌, సాంకేతిక నైపుణ్యం అందిస్తూనే  తమ నెట్‌వర్క్‌ భాగస్వాములను సర్క్యులేట్‌ క్యాపిటల్‌  పరిచయం చేస్తుంది, తద్వారా వారు దీర్ఘకాలం పాటు వృద్ధి చెందుతారు.