శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (19:11 IST)

సురక్షితమైన రేపటి కోసం దేశాన్ని ఏకం చేసే ఉద్యమం ఐ వాంట్‌ మై పింక్‌ బెల్ట్‌

మహిళా భద్రతకు సంబంధించిన సురక్షా పరికరాన్నివాస్తవంగా అమలులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ, పిటీషన్‌పై సంతకాలను చేయడం ద్వారా తమ మద్దతును అందించాల్సిందిగా లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ, పింక్‌బెల్ట్‌ మిషన్‌ ఇప్పుడు భారత ప్రజలను కోరుకుంటోంది. పింక్‌ బెల్ట్‌ ముఖ్యోద్దేశం అసాల్ట్‌ అలర్ట్‌ బ్యాండ్‌. దీనిలో లైవ్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవి దగ్గరలోని స్ధానిక అధికారులను, వైద్య కేంద్రాలు మరియు కుటుంబ సభ్యులను కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా ఆప్రమప్తం చేస్తాయి. అదే సమమంలో ప్రమాదంలో ఉన్న మహిళలకు రక్షణ  మరియు తక్షణ వైద్యం అందించడంలోనూ సహాయపడుతుంది.
 
2019వ సంవత్సరంలో ప్రతి 13 నిమిషాలకూ ఓ మానభంగం భారతదేశంలోనమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 1000కు పైగా యాసిడ్‌ దాడులు జరుగడంతో పాటుగా మహిళలపై 30%కు పైగా దాడులు గృహ హింస కేసులుగానే నమోదయ్యాయి అని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోవెల్లడించింది. వాస్తవంగా ఈ అవాంఛనీయ మరియు ఆమోదయోగ్యం కాని నేరాలను  నిరోధించడానికి ప్రయత్నించడంతో పాటుగా, ఈ తరహా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు వైద్య సహాయం ఆలస్యం కావడానికి, ఎంతోమంది బాధితులు మృత్యువాత పడటానికి అసలైన కారణాన్ని పింక్‌ బెల్ట్‌ మిషన్‌ గుర్తించింది.
 
వీరి యొక్క నిరంతర ప్రయత్నాల కారణంగానే, వారు బలీయమైన వ్యవస్థనురూపొందించగలిగారు. దీనికి ప్రభుత్వ మద్దతు తప్పనిసరి. తద్వారా ప్రతిపాదిత లైఫ్‌సేవింగ్‌ నేపథ్యం మరియు పింక్‌ బెల్ట్‌ను వాస్తవికంగా అందుబాటులోకి తీసుకురావడం నడుమఅంతరాలనుఇది పూరిస్తుంది. ఈ జీవావరణవ్యవస్థ కేవలం ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడటం మాత్రమే కాకుండా, తక్షణ సహాయంకోరడానికి, దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోని ప్రజలకు దానిని వెల్లడి చేయడమూ చేస్తుంది.
 
ఈ భావనను పేపర్‌పై కనిపించేలా చేసేందుకు, పింక్‌బెల్ట్‌ మిషన్‌ ఇప్పుడు pinkbeltmission డాట్ org లోని ఐ వాంట్ పింక్ బెల్ట్ పిటీషన్‌పై ప్రజలు సంతకం చేయాల్సిందిగా అభ్యర్ధిస్తోంది. తద్వారా జాతిని మేల్కొలిపే ఉద్యమంగా దీనిని మార్చమని కోరుతోంది. ఈ పిటీషన్‌పై కేవలం సంతకాలు చేయడం మాత్రమే కాకుండా, పింక్‌ బెల్ట్‌ మిషన్‌ ఇప్పుడు ఈ విప్లవాత్మక నేపథ్యం ద్వారా ప్రభుత్వ మరియు భారత ప్రజల మద్దతుతో జీవితాలపై ప్రభావం చూపడానికీ ప్రయత్నిస్తుంది.
 
పింక్‌బెల్ట్‌మిషన్‌ ఇప్పుడు ప్రజల నడుమ చర్చను జరిగేలా శక్తివంతమైన వీడియోను సైతం రూపొందించింది. దేశంలో మహిళల స్ధితిగతులకు అద్దంపట్టేలా ఇది ఉంటుంది. ఈ వీడియోనిచూసినప్రతివ్యక్తీఈ పిటీషన్‌పై సంతకం చేసేలా ప్రేరేపించేరీతిలో ఈ వీడియోను సృష్టించారు. ఐవాంట్‌ మై పింక్‌ బెల్ట్‌ ఉద్యమం ద్వారా, దేశం ఏకతాటిపైకి రావడంతో పాటుగా ఈ వినూత్నమైన సందేశాన్నివాస్తవంగా బయటకు రావడంలో సైతం తోడ్పడుతుంది.
 
ఈ అంశాలపై తన ఆలోచనలను అపర్ణ రజావత్‌, ఫౌండర్‌, పింక్‌బెల్ట్‌ మిషన్‌ వెల్లడిస్తూ, ‘‘మానభంగాల కారణంగా ఎన్నో మరణాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది యాసిడ్‌ దాడి బాధితులు కంటిచూపు కోల్పోవడంతో పాటుగా ఆ భయంతోనే తమ జీవితాంతమూ గడుపుతున్నారు. ప్రతిసారీ పింక్‌బెల్ట్‌మిషన్‌ ఈ తరహా సంఘటలను దాటి ముందుకు వస్తున్నప్పటికీ, అత్యంత సమస్యాత్మకంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోన్న అంశమేమిటంటే సమయానికి తగిన సహాయం పొందలేకపోతుండటం. అది నేరాన్ని నిరోధించడంలోనే కావొచ్చు లేదా వేగవంతంగా వైద్య సహాయం అందించడమైనా కావొచ్చు.
 
ఈ పింక్‌బెల్ట్‌మిషన్‌ ద్వారా మేము ప్రభుత్వ సహాయం తీసుకుని ఈ అసాల్ట్‌ అలర్ట్‌ నేపథ్యాన్ని వాస్తవంగా బయటకు తీసుకురావడంతో పాటుగా ఆపదలో ఉన్న వారికి తగిన సహాయం అందించేలా కృషి చేస్తున్నాము. ప్రభుత్వ సహాయంతో, పింక్‌ బెల్ట్‌ ఇప్పుడు సుదూరతీరాలు వెళ్లడంతో పాటు జీవితాలనూ కాపాడుతుంది. అంతేకాదు, ఈ చర్యతో ప్రతి రోజూ మన దేశం మహిళను సురక్షితంగా నిలుపడంలోనూ తోడ్పడుతుంది’’ అని అన్నారు
 
మాన్సీ చంద్ర, అసోసియేట్‌, పింక్‌బెల్ట్‌ మిషన్‌ మాట్లాడుతూ, ‘‘గ్రామీణ భారతదేశంలో అత్యాచార ఘటనలను వెల్లడించడమన్నది ఇప్పటికీ ఓ తప్పుగా భావిస్తుండటంతో, బాధితులు సగం పోరాటాన్ని తక్షణ వైద్య సహాయం పొందక కోల్పోతున్నారు. అధికారులకు ఈ ఉద్దేశాన్ని పరిచయం చేయడం ద్వారా, కనీసం సంఘటనతో పాటుగా చట్టం నిర్ధేశించినట్లుగా అవసరమైన మద్దతు పొందడంలో ఉన్న సమస్యలను తొలగించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం.
 
చట్టం నిర్ధేశించినప్పటికీ దురదృష్టవశాత్తు అవసరమైన సమయంలో అధిక శాతం మంది మహిళలకు ఈ సహాయం అందడం లేదు. మహిళలకు సురక్షితమైనదేశంగా మన దేశాన్ని మలచడంలో ఇది మా చిరు ప్రయత్నం. ప్రతి మహిళా తమ పింక్‌ బెల్ట్‌ కావాలని అధికారులకు వినబడేలానినాదించాలని మేము ప్రోత్సహిస్తున్నాం. తద్వారా ఈ ఉద్యమాన్ని మన లక్ష్యాల లాగానే వాస్తవంగానూ మార్చగలం’’ అని అన్నారు.
 
ఫిబ్రవరి 2020లో పింక్‌ బెల్ట్‌ మిషన్‌కు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును అతిపెద్ద సెల్ఫ్‌ డిఫెన్స్‌ వర్క్‌షాప్‌ నిర్వహించినందుకు అందించారు. పలు రంగాలలో 1.5 లక్షల మంది మహిళలకు ఈ శిక్షణ అందించారు. ఈ లక్ష్యం చేరుకునేందుకు వారికి 2 వేల మందికి పైగా శిక్షకులు సహాయపడ్డారు. తమ ప్రయత్నాలతో, పింక్‌ బెల్ట్‌ మిషన్‌ ఇప్పుడు మహిళలు మరియు చిన్నారుల జీవితాలలో మార్పు తీసుకురావాలని కోరుకుంటుంది. తద్వారా సమాజంలో తాము కూడా ముఖ్యమేనన్న భావన కల్పిస్తుంది.