బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (16:47 IST)

స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన కీలకమైన అంశాలు

Alice Blue
భారతీయ స్టార్టప్‌ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. మరింతమంది మదుపరులు తొలి దశ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను చూస్తున్నారు. అయితే, స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందువల్ల నిర్ణయాలను తీసుకునే ముందు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఓ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, ఆ కంపెనీ విలువను మదింపు చేయడం అత్యంత కీలకాంశం. ఇటీవలి యూనికార్న్‌ బబుల్‌తో, భారతదేశంలో చాలా వరకూ స్టార్టప్‌లకు అసాధారణ విలువ కట్టారు, కానీ తమ పెట్టుబడులపై తగిన రాబడులను పొందడం మదుపరులకు చాలా కష్టతరంగా మారింది.
 
మదుపరునిగా, పెట్టుబడులు పెట్టేముందు ఆ కంపెనీ ఆదాయం, లాభాలు దాని ధరతో మ్యాచ్‌ అవుతున్నాయా లేదా అన్నది చూడటం చాలా అవసరం. దీనికోసం అదే తరహా వ్యాపారంలో ఉన్న ఇతర కంపెనీలతో పోల్చడం ద్వారా కంపెనీ వృద్ధి అవకాశాలు మరియు లాభదాయక అవకాశాలను సైతం అంచనా వేయవచ్చు. కంపెనీ ఆదాయం, లాభాలను పరిగణలోకి తీసుకునేటప్పుడు చూడాల్సిన మరో అంశం, ఇప్పటికే ఆ కంపెనీ ఆదాయం సృష్టించడంతో పాటుగా లాభాలను స్వీకరిస్తున్నదా లేదా చూడటం. దీనివల్ల భవిష్యత్‌లో ఆ వ్యాపార నమూనా విజయవంతమవుతుందా లేదా అన్నది నిర్ణయించవచ్చు.
 
ఓ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టేముందు పరిగణలోకి తీసుకోవాల్సిన మరో అంశం మేనేజ్‌మెంట్‌ బృందం. ఈ  బృందమే వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంతోపాటుగా  కంపెనీ తొలి దశలో వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. అందువల్ల ఈ టీమ్‌ ట్రాక్‌ రికార్డు, అనుభవం, వారి ప్రణాళికలను అమలు చేయగల సామర్ధ్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆ స్టార్టప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న  పరిశ్రమ, మార్కెట్‌ పరిమాణం, పోటీ సైతం పరిగణలోకి తీసుకోవాలి. స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఇక్కడ విజయవంతం అయ్యేందుకు ఎలాంటి హామీ ఉండదు. కానీ వాల్యుయేషన్‌, ఆదాయం, లాభాలు, మేనేజ్‌మెంట్‌ బృందం, పరిశ్రమ, మార్కెట్‌ పరిమాణం,  పోటీలను పరిగణలోకి తీసుకోవాలి. తద్వారా మీ పెట్టుబడులకు తగిన లాభాలను స్వీకరించవచ్చు.
 
ఇటీవలి కాలంలో, ఎన్నో స్టార్టప్‌ల స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించాయి. కొన్ని బాగానే నిలదొక్కుకున్నా, కొన్ని మాత్రం నష్టపోయాయి. అలీస్‌ బ్లూ వద్ద మేము మీకు పెట్టుబుడుల వేదికను అందించడం మాత్రమే కాదు, ఆర్ధిక సమాచారం కోసం విద్యా పోర్టల్‌గా కూడా సేవలను అందిస్తుంటాము. అందువల్ల మీరు సమాచారంతో కూడిన గుణాత్మక నిర్ణయాలను తీసుకోగలరు.
-సిద్ధవేలాయుధం, సీఈఓ-ఫౌండర్‌, అలీస్‌ బ్లూ.