శనివారం, 18 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 అక్టోబరు 2025 (23:24 IST)

అమెరికా టారిఫ్‌లు పెరగడం, H-1B వీసా ఫీజు పెంపుదల అయినా స్థిరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ

Amnish
భారతదేశ అత్యంత విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన పీఎల్ క్యాపిటల్, హోల్డింగ్ స్టెడీ ఇన్ గ్లోబల్ హెడ్‌విండ్స్ అనే తన తాజా ఇండియా స్ట్రాటజీ నివేదికలో అమెరికా టారిఫ్‌లు పెరగడం, H-1B వీసా ఫీజు పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి ప్రపంచ ఎదురుగాలులు ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు అద్భుతమైన స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూనే ఉన్నాయని పేర్కొంది.
 
సాధారణ రుతుపవనాలు, వడ్డీ రేట్లలో 100-బేసిస్ పాయింట్ల తగ్గింపు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, FY26 బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను తగ్గింపులతో, వినియోగంలో బలమైన పునరుద్ధరణకు పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ప్రముఖంగా చాటిచెబుతోంది. జీఎస్టీ 2.0 అమలు ప్రపంచ సుంకాల ప్రభావాన్ని మరింతగా భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. అయితే 2026లో రాబోయే 8వ వేతన సంఘం గృహ సంబంధిత ఖర్చులకు అదనపు ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంది. ఇది FY27 వరకు ఆర్థిక ఊపును కొనసాగించడంలో సహాయపడుతుంది. 2026 రెండో అర్థ వార్షికంలో డిమాండ్ పునరుద్ధరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుండి వినియోగదారుల డిమాండ్ బలంగా పుంజు కుందని, ఇది వాహన మరియు విచక్షణా విభాగాలలో కనిపిస్తుంది అని పేర్కొంది.
 
జీఎస్టీ పరివర్తన, అనేక పరిశ్రమలలో ట్రేడ్ డీ-స్టాకింగ్ కారణంగా 2QFY26 సంఖ్యలు అస్థిరంగా ఉంటాయని PL క్యాపిటల్ అంచనా వేసినప్పటికీ, రాబోయే త్రైమాసికాల్లో కన్జ్యూమర్ స్టేపుల్స్, డ్యూరబుల్స్, దుస్తులు, పాదరక్షలు మొదలైన వాటిలో బలమైన డిమాండ్ ధోరణులు ఉండవచ్చని భావిస్తోంది. జీఎస్టీ రేట్లలో వాహనరంగం పెద్ద రీసెట్‌ను చూసింది. అంతేగాకుండా పండుగ సీజన్ ప్రారంభం బలంగా ఉంది. ప్యాసింజర్ వాహననాలు, ద్విచక్ర వాహనాలు రెండింటికీ డిమాండ్‌లో బలమైన పెరుగుదల కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం.
 
రక్షణ, సెమీకండక్టర్లు, ఓడరేవులు, ఆనకట్టలు, అణుశక్తి మొదలైన వాటికి పెట్టుబడి పెట్టడానికి బలమైన నిబద్ధతతో ఉన్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే, FY21 నుండి ప్రభుత్వ మూలధనం 3x కంటే ఎక్కు వగా ఉన్నందున పెరుగుతున్న ప్రభుత్వ ప్రోత్సాహం పరిమితం అయ్యే అవకాశం ఉంది. మొదటి ఐదు నెలల్లో భారత ప్రబుత్వం ద్వారా 43% అధిక మూలధన వ్యయం కనిపించింది. కేంద్రప్రభుత్వం ద్వారా పెరుగుతున్న కేటాయింపులు లేకపోతే మిగిలిన సంవత్సరం ఫ్లాట్‌గా ఉంటుంది. డిమాండ్ పునరుద్ధరణ అనేది ప్రైవేట్ రంగ సామర్థ్య వినియోగాన్ని పెంచుతుంది. దానికి తోడుగా ప్రైవేట్ రంగ క్యాపెక్స్‌ను కూడా పెంచుతుంది.
 
భారతదేశ కరెంట్ ఖాతా: బంగారం దిగుమతి మినహా నిర్మాణాత్మక మిగులు
భారతదేశ కరెంట్ ఖాతా డైనమిక్స్ చాలా కాలంగా నిరంతర లోటు అనే దృక్పథం ద్వారా గ్రహించబడింది. ఇది చమురు, బంగారం వంటి వస్తువులపై ఆర్థిక వ్యవస్థ అధిక దిగుమతులతో ఆధార పడటాన్ని ప్రతిబింబి స్తుంది. అయితే, సాధారణ వినియోగ వస్తువుల మాదిరిగా కాకుండా, బంగారం దిగుమతులు ఎక్కువగా కుటుంబ పొదుపు పోర్ట్‌ఫోలియోలలోనే కాకుండా కేంద్ర బ్యాంకులలో కూడా ఆస్తి లేదా పెట్టుబడి తరగతిని సూచిస్తాయి.
 
బంగారం మొత్తం డిమాండ్ 2010/2011 గరిష్ట స్థాయిని దాటకపోయినా, ఆర్బీఐ కొను గోళ్లు, పెట్టుబడి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2010- 2018 మధ్య ఆర్బీఐ తన నిల్వలకు బంగారాన్ని జోడించలేదు. అయితే, మార్చి 25 నాటికి 375 టన్నులు అదనంగా బంగారాన్ని జోడించింది, మొత్తం నిల్వలు 880 టన్నులకు చేరుకున్నాయి.
 
2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% వృద్ధితో బలాన్ని ప్రదర్శించిన జీడీపీ 
భారతదేశ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను పున రుద్ఘాటించింది. 7.8%తో వార్షిక ప్రాతిపదికన అంచనాలను అధిగమించింది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6.5% గా, 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 7.4%గా ఉండింది. తయారీ, సేవల రంగాలలో బలమైన ఊపుతో పాటు స్థిరమైన వినియోగ డిమాండ్, సహాయక విధాన పరిస్థితులు ఈ జోరుకు దారితీశాయి. నామినల్ టర్మ్స్ పరంగా, జీడీపీ 8.8% పెరిగింది. ఇది ఒక సంవత్సరం క్రితం 9.7% నుండి తగ్గింది. ఇది ధరల ఒత్తిళ్లను తగ్గించడం, తక్కువ ద్రవ్యో ల్బణంను ప్రతిబింబిస్తుంది. ఖర్చు విషయానికి వస్తే, ప్రభుత్వ వినియోగం, పెట్టుబడి కార్యకలాపాలు రికార్డు స్థాయిలో ప్రజా మూలధనం నేపథ్యంలో విస్తరిస్తూనే ఉన్నాయి.
 
జీఎస్టీ వసూళ్లు, ఇ-వే బిల్లుల నుండి సేవల ఎగుమతులు, క్రెడిట్ వృద్ధి వరకు అధిక-ఫ్రీక్వెన్సీ సూచికలు దేశీయ డిమాండ్‌లో అంతర్లీన బలాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆర్బీఐ తన FY26 వృద్ధి అంచనాను 6.8%కి సవరించింది, Q2లో జీడీపీ 7% పెరుగుతుందని అంచనా. ప్రధాన వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, బయటి ముప్పు అవకాశాలు కొనసాగుతున్నాయి, ముఖ్యంగా సుంకాల సంబంధిత అనిశ్చితులు, అస్థిర ప్రపంచ వాణిజ్య వాతావరణం నుండి.
 
H-1B వీసా విధానంలో ఎదురుదెబ్బను తగ్గించనున్న GCC వృద్ధి
భారతదేశ సేవల ఎగుమతులు డిజిటల్‌గా అందించబడే, అధిక-విలువైన జ్ఞాన సేవల ద్వారా కొత్త వృద్ధి దశ లోకి ప్రవేశిస్తున్నాయని పీఎల్ క్యాపిటల్ పేర్కొంది. 2030 నాటికి, దేశం సుమారు 2,200 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లను (GCCలు) నిర్వహిస్తుందని అంచనా వేయబడింది. ఇవి USD 100 బిలియన్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తాయి. మొత్తం సేవల ఎగుమతులు USD 500 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, GenAI ప్రొడక్ట్ ఇంజనీరింగ్, సస్టైనబిలిటీ అనలిటిక్స్ వంటి రంగాలలో పెరుగుతున్న డిమాండ్‌తో ప్రతిభావంతుల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా భారతదేశం స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
 
భారతదేశ జీసీసీలు FY24లో USD 64.6 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది FY23లో ఉండిన USD 46 బిలియన్ల నుండి పెరిగింది. ప్రపంచ స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ బలమైన 40% వృద్ధి చోటు చేసుకుంది. దేశ సాంకేతిక దృశ్యం గణనీయమైన పరివర్తనకు లోనవుతోంది. జీసీసీలు  సంప్రదాయ ఐటీ సంస్థల కంటే చాలా వేగంగా విస్తరి స్తున్నాయి. FY2025లో, సంప్రదాయ IT కంపెనీల నికర ఉద్యోగ జోడింపు లు 11,000గా ఉన్నాయి, అయితే జీసీసీలు అదే కాలంలో 100,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి.
 
ప్రపంచ ప్రతికూలతలను స్థిరంగా ఉంచడం
అమెరికా పెనాల్టీ, నాన్-పీనల్ టారిఫ్‌లు పెరగడం, ఎఫ్ఐఐ ద్వారా రూ. 850 బిలియన్ల అమ్మకాలు వంటి ఎదురుగాలులు ఉన్నప్పటికీ, గత మూడు నెలలుగా భారత మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. సాధారణ రుతుపవనాలు, దేశీయ డిమాండ్‌లో అంచనా వేసిన పెరుగుదల అనేవి ప్రస్తుత ప్రతికూల వార్తల ప్రవాహాన్ని మార్కెట్లు గ్రహించడానికి కీలకమైన ఉత్ప్రేరకాలు.
 
భౌగోళిక రాజకీయ పరిస్థితి దుర్బలంగా ఉన్నప్పటికీ, పీనల్ టారిఫ్స్, H-1B వీసాలకు చెల్లించే మొత్తం భారీ పెరుగుదల ప్రభావాన్ని భారతదేశం తట్టుకోగలదని పీఎల్ క్యాపిటల్ పేర్కొంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఏదైనా గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉంటే, దాన్ని పెరుగుతున్న జీసీసీ  ఎగుమతులు తగ్గిస్తాయి. ప్రస్తుత ప్రపంచ రక్షణవాద తరంగం వాణిజ్యానికి ప్రతికూలంగా ఉందని, భవిష్యత్తులో ప్రపంచ వృద్ధిని ప్రభావితం చేస్తుందని పీఎల్ క్యాపిటల్ విశ్వసిస్తోంది. కొన్ని నెలల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అంచనాలు ఉన్నప్పటికీ, వ్యవసాయం, పాడి పరిశ్రమ, జీఎం పంటలు, శ్రమతో కూడిన పరిశ్రమలపై నిరంతర వ్యత్యాసాల కారణంగా పరిస్థితి మరింత కఠినంగా కనిపిస్తోంది. మొదటి ఐదు నెలల్లో భారత ప్రభుత్వం ద్వారా 43% అధిక మూలధన వ్యయం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా పెరుగుతున్న కేటాయింపులు లేకపోతే మిగిలిన సంవత్సరం ఫ్లాట్‌గా ఉంటుంది. డిమాండ్ పునరుద్ధరణ ప్రైవేట్ రంగ సామర్థ్య వినియోగాన్ని, పక్కన వేచి ఉన్న ప్రైవేట్ క్యాపెక్స్‌ను పెంచే అవకాశం ఉంది.
 
మార్కెట్ విషయంలో పీఎల్ క్యాపిటల్, నిఫ్టీని దాని 15 సంవత్సరాల సగటు P/E మల్టిపుల్ 19.2x వద్ద విలువ కట్టింది, ఇది సెప్టెంబర్ 27 EPS అంచనా ₹1,499 ఆధారంగా, 12 నెలల లక్ష్యం 28,781 (గతంలో 27,609)కి చేరుకుంటుంది. బుల్ కేసులో 20x అధిక మల్టిపుల్ ను పీఎల్   క్యాపిటల్ కేటాయిస్తుంది, ఇది 30,220 (గతంలో 28,990) లక్ష్యాన్ని సూచిస్తుంది. బేర్ కేసులో నిఫ్టీ తన దీర్ఘకాలిక సగటుకు 10% తగ్గింపుతో ట్రేడ్ చేస్తుందని ఊహిస్తే, అది 25,903 (గతంలో 24,848) లక్ష్యాన్ని పొందుతుంది.